IUI చికిత్స తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి.. IUI సాధారణంగా ఎవరికి చేస్తారు?

 IUI చికిత్స తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి.. IUI సాధారణంగా ఎవరికి చేస్తారు? 



IUI (ఇన్‌ట్రా యుటరైన్ ఇన్సెమినేషన్) పద్ధతిని గర్భధారణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులకు సిఫారసు చేస్తారు. ముఖ్యంగా ఈ కింది పరిస్థితులలో IUI ఉపయోగపడుతుంది:

1. పురుషుని స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు గర్భధారణకు అవకాశం కల్పించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.

2. స్పెర్మ్ మొటిలిటీ సమస్యలు ఉన్నప్పుడు.. అంటే  స్పెర్మ్ వేగంగా Egg దగ్గరకి చేరలేని పరిస్థితుల్లో IUI సహాయపడుతుంది.

3. Unexplained Infertility - గర్భం రాకపోవడానికి స్పష్టమైన కారణం లేనప్పుడు మొదటి చికిత్సగా IUI ప్రయత్నిస్తారు.

4. ఓవ్యూలేషన్ (అండోత్పత్తి) సమస్యలు ఉన్నప్పుడు.. కొన్ని సార్లు మందులతో అండోత్పత్తిని ప్రేరేపించి IUI చేస్తారు.

5. Ejaculatory duct obstruction సమస్యలు లేదా సెక్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు స్త్రీ గర్భాశయంలో స్పెర్మ్ నేరుగా పెట్టడం వల్ల సమస్య అనేది రాకుండా ఉంటుంది.

6. డోనర్ స్పెర్మ్‌ను ఉపయోగించి గర్భధారణ ప్రయత్నించేటప్పుడు IUI వినియోగిస్తారు.

ఈ విధానం చాలా మందికి సురక్షితంగా ఉండే మొదటి ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ ఆప్షన్‌గా ఉంటుంది. కానీ, వైద్యుడి మార్గదర్శకంతోనే అనుసరించాలి.



మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post