IVF procedure: IVF (In Vitro Fertilization) ప్రొసీజర్‌లో ఎక్కువ భాగం సీరియస్ నొప్పితో ఉండదు, కానీ కొంత అసౌకర్యం అనుభవించడం సాధారణం.
ట్రీట్మెంట్ స్టెప్ వారీగా చూస్తే:
- హార్మోన్ ఇంజెక్షన్లు:- అండాశయాలను (Ovaries) ఎక్కువ అండాలు ఉత్పత్తి చేయడానికి రోజువారీ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి సాధారణంగా చిన్న సూదులతో ఇస్తారు, కాబట్టి స్వల్పమైన అసౌకర్యం, గుచ్చినట్టుగా అనిపించవచ్చు కానీ ఎక్కువ నొప్పి ఉండదు.
- ఎగ్ రిట్రీవల్ (Egg Collection):- ఇది మైనర్ సర్జరీలా ఉంటుంది కానీ పూర్తిగా జనరల్ అనస్థీషియా లేదా సేడేషన్‌లో చేస్తారు. కాబట్టి ప్రొసీజర్ సమయంలో నొప్పి ఉండదు. తర్వాత కొద్ది గంటలపాటు పొట్ట దిగువ భాగంలో బరువుగా లేదా తేలికపాటి నొప్పి వచ్చినట్టుగా అనిపించవచ్చు.
- ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్:- ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. నొప్పి లేకుండా, కేవలం స్వల్ప అసౌకర్యం మాత్రమే ఉంటుంది.
- ప్రొసీజర్ తర్వాత:- హార్మోన్ మార్పుల వల్ల బ్లోటింగ్, బరువుగా అనిపించడం, తేలికపాటి క్రాంప్స్ రావచ్చు. ఇవి తాత్కాలికమే.
మొత్తం మీద, IVF నొప్పితో కూడిన ట్రీట్మెంట్ కాదు, కానీ హార్మోన్ ఇంజెక్షన్లు మరియు ఎగ్ రిట్రీవల్ తర్వాత స్వల్ప అసౌకర్యం సహజం. మంచి అనుభవం కోసం డాక్టర్ సూచనల్ని ఫాలో అవడం, విశ్రాంతి తీసుకోవడం ఉపయోగకరం.
Also Read: సంతానం కలగాలంటే స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి?