Hypopituitarism in Pregnancy: హైపోపిట్యూటరిజం అనేది పిట్యూయిటరీ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల ఏర్పడే హార్మోన్ల లోప పరిస్థితి. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు ముఖ్యంగా FSH (ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) మరియు LH (లూటినైజింగ్ హార్మోన్) ఓవరీలు సక్రమంగా పనిచేయడానికి అవసరమవుతాయి. ఇవి తక్కువగా ఉత్పత్తి అయితే, మహిళల్లో అండాల విడుదల (ఓవ్యూలేషన్) సరిగ్గా జరగదు, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా మారతాయి. దాంతో గర్భం రాకపోవచ్చు.
అయితే, హైపోపిట్యూటరిజం ఉన్న మహిళలు పూర్తిగా గర్భం ధరించలేరని కాదు. పరోక్షంగా సహాయపడే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, హార్మోనల్ థెరపీ (హార్మోన్ల ఇంజెక్షన్లు) ద్వారా ఓవ్యూలేషన్‌ను మళ్ళీ ప్రేరేపించవచ్చు. సిస్టమేటిక్ గానూ ఫోలిక్యూలర్ మానిటరింగ్ చేస్తూ, ఇంటర్‌కోర్స్ సరైన సమయానికి జరిగేటట్లు చూడటం లేదా IUI/IVF వంటి చికిత్సల ద్వారా గర్భధారణ సాధ్యమే.
ముఖ్య విషయం ఏమిటంటే.. హైపోపిట్యూటరిజం కారణంగా వచ్చిన హార్మోన్ లోపం మాత్రమే సమస్యగా ఉంటే, అది తగిన డయాగ్నోసిస్‌తో, ఎండోక్రినాలజిస్ట్ పర్యవేక్షణలో సరైన ప్లాన్ ద్వారా తేలికగా మెడికల్ మేనేజ్‌మెంట్ చేయవచ్చు. కానీ ఇతర సమస్యలు ఉంటే పూర్తి హెల్త్ అసెస్‌మెంట్ అవసరం అవుతుంది.
అందువల్ల, హైపోపిట్యూటరిజం ఉన్నప్పటికీ, సరైన చికిత్స, పర్యవేక్షణతో ముందుకెళితే గర్భధారణ సాధ్యమే. ప్రస్తుతం మెడికల్ సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినదో చూస్తే హార్మోన్ డిఫిషియెన్సీ వల్ల గర్భం రాకపోవడం పెద్ద సమస్య కాదు.
Also Read: వయసు పెరిగే కొద్దీ గర్భధారణపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility