Menstrual Cup: మహిళలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్ సమయంలో అసౌకర్యం తప్పదు. ఈ సమయంలో కొందరికి అధిక రక్తస్రావం ఉండడం సాధారణం. సాధారణంగా మహిళలు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు శానిటరీ నాప్‌కిన్లు, ప్యాడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.
![]() |
Menstrual Cup |
మెన్స్ట్రువల్ కప్‌ను మెడికల్-గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేస్తారు. ఇది పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని సేకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక్కసారి అమర్చితే 10–12 గంటల వరకు ఉపయోగించవచ్చు. నాప్‌కిన్స్, టాంపూన్స్‌తో పోలిస్తే మెన్స్ట్రువల్ కప్ మరింత రక్తాన్ని సేకరిస్తుంది. రీయూజ్ చేయగల ఈ కప్, పర్యావరణానికి మేలు చేసే ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్. ఒక కప్‌ను సరైన జాగ్రత్తలతో పదేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు.
కొనే ముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు
మీ వయసు, సర్విక్స్ పొడవు, పీరియడ్ ఫ్లో, కప్ ఫ్లెక్సిబిలిటీ, డెలివరీ విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
మెన్స్ట్రువల్ కప్ ఎలా ఇన్సర్ట్ చేయాలి?
- ముందుగా కప్ అంచులను నీటితో తడపాలి.
- అంచులు పైకి ఉండేలా కప్‌ను ఒక చేతితో మడిచి పట్టుకోవాలి.
- కప్‌ను నెమ్మదిగా అంతర్గత భాగంలోకి ఇన్సర్ట్ చేయాలి.
- లోపలికి పెట్టిన తరువాత కప్‌ను స్వల్పంగా తిప్పాలి.
- సరిగా అమర్చితే కప్ ఉందని మీకు అనిపించదు.
తీయడం ఎలా?
- ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
- బొటనవేలు, చూపుడు వేళ్లతో కప్ కింది మొన భాగాన్ని పట్టుకోవాలి.
- నెమ్మదిగా బయటకు తీసి, శుభ్రం చేయాలి.
- రోజుకు కనీసం రెండు సార్లు కప్‌ను మార్చడం అవసరం.
మెన్స్ట్రువల్ కప్, ప్యాడ్స్‌తో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తుంది. పదేపదే మార్చాల్సిన అవసరం లేదు. సరిగ్గా అమర్చితే తడి, చికాకు, లీకేజీ వంటి సమస్యలు లేకుండా సౌకర్యంగా ఉంటుంది.
వాడకానికి ముందు తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. మెన్స్ట్రువల్ కప్‌లు స్మాల్, లార్జ్ సైజుల్లో లభిస్తాయి. మీకు సరిపోయే సైజును నిపుణుల సలహా ప్రకారం ఎంచుకోవాలి.
Also Read: ఫెర్టిలిటీని కాపాడే ముఖ్యమైన వ్యాక్సిన్‌లు!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility