Causes of UTI in Women: మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి 5 ప్రధాన కారణాలు! - Dr. Sasi Priya

Causes of UTI in Women: మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) చాలా సాధారణమైన సమస్య. చిన్నపాటి అసౌకర్యం నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వరకు సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, టాయిలెట్‌కు తరచుగా వెళ్లాలనిపించడం, మూత్రం చేస్తున్నప్పుడు మంట, పొత్తికడుపు బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న ముఖ్యమైన ఐదు కారణాలను ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా ఈ బ్లాగ్ లో తెలుసుసుకుందాం.

Causes of UTI in Women
Causes of UTI in Women

1. మహిళల శరీర నిర్మాణమే ముఖ్య కారణం
మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం వారి శరీర నిర్మాణం. మహిళల్లో మూత్రాశయం -Urethra (మూత్రం బయటికి వచ్చే నాళం) పురుషులతో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది. అందువల్ల బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా సులభంగా మూత్రాశయం వరకు చేరి ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టాయిలెట్ తరువాత వెనుక నుంచి ముందుకు తుడిచితే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది.

Also Read: IVF చేయించుకోవాలంటే కచ్చితంగా చూపించాల్సిన డాక్యుమెంట్లు!

2. తగినంత నీరు తాగకపోవడం
రోజు మొత్తం తగినంత నీరు తాగకపోవడం కూడా UTI కి ప్రధాన కారణం. శరీరానికి తగినంత నీరు అందకపోతే మూత్రం మరింత గాఢంగా మారుతుంది. యూరిన్ ఫ్లో తగ్గుతుంది. ఈ పరిస్థితిలో బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. నీరు ఎక్కువగా తాగితే మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటికి వెళ్లిపోతుంది. అందుకే రోజుకు కనీసం 2-2.5 లీటర్ల నీరు తాగడం చాలా ముఖ్యం.

3. టాయిలెట్ హైజీన్ లోపించడం
బయటి పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగించడం, శుభ్రం కాని టాయిలెట్లు, అనారోగ్యకరమైన అలవాట్లు కూడా ఇన్ఫెక్షన్ రిస్క్‌ను పెంచుతాయి. ముఖ్యంగా, టాయిలెట్ సీట్‌పై నేరుగా కూర్చోవడం, తడి ఉండే ఇన్నర్‌వేర్ ధరిస్తే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. టాయిలెట్ తరువాత dry wipes ఉపయోగించకపోవడం, అండర్‌వేర్ తరచూ మార్చకపోవడం కూడా ప్రమాదకరం.

4. హార్మోన్ల మార్పులు
మహిళల్లో పీరియడ్స్ సమయంలో, ప్రెగ్నెన్సీలో, మోనోపాజ్ సమయంలో హార్మోన్లలో పెద్ద మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు యూరినరీ ట్రాక్ట్‌ను రక్షించే నేచురల్ ఫ్లోరాను తగ్గిస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా చుట్టూ పెరిగి UTI కల్గించే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా గర్భిణీల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

5. సంబంధ సమయంలో వచ్చే బ్యాక్టీరియా
సంబంధ సమయంలో బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా నేరుగా మూత్రాశయం దగ్గరకు చేరే అవకాశం ఉంటుంది. సంబంధం తరువాత వెంటనే మూత్రం పోకపోవడం, హైజీన్ పాటించకపోవడం ఈ రిస్క్‌ను మరింత పెంచుతుంది. అందుకే సంబంధం తరువాత తప్పనిసరిగా wash చేయడం, మూత్రం పోవడం వల్ల బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.


యూరిన్ ఇన్ఫెక్షన్‌ను సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ దానిని నిర్లక్ష్య చేస్తే కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన నీరు తాగడం, టాయిలెట్ హైజీన్ పాటించడం, హార్మోనల్ మార్పుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే త్వరగా రికవరీ అవ్వచ్చు.


Post a Comment (0)
Previous Post Next Post