Egg Freezing Process: నేటి కాలంలో అనేక మహిళలు వారి కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలు, లేదా ఆరోగ్య కారణాల వల్ల తల్లి కావడాన్ని కొంత ఆలస్యం చేయాలని అనుకుంటున్నారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ అండాల నాణ్యత తగ్గిపోవడం సహజం. ఇలాంటి సమయంలో భవిష్యత్తులో గర్భధారణ కోసం అండాలను ముందుగా సేకరించి భద్రపరచే ప్రక్రియనే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయంగా, కొన్ని ప్రత్యేక దశల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు దానిని స్టెప్ బై స్టెప్‌గా తెలుసుకుందాం…
Step 1: వైద్య సలహా మరియు ప్రాథమిక పరీక్షలు: ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మహిళ ఆరోగ్య స్థితిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక హార్మోన్ల పరీక్షలు (FSH, AMH, LH, Estrogen), బ్లడ్ టెస్టులు మరియు పెల్విక్ అల్ట్రాసౌండ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అండాశయాల్లో ఎన్ని అండాలు ఉండవచ్చు? అవి ఆరోగ్యంగా ఉన్నాయా? అనే విషయాలు తెలుస్తాయి.
ఈ దశలోనే వైద్యులు మహిళ వయసు, ఆరోగ్య పరిస్థితి, గతపు మెడికల్ హిస్టరీను పరిశీలించి ఎగ్ ఫ్రీజింగ్ ఆమెకు అనువైనదా కాదా నిర్ణయిస్తారు.
Step 2: ఒవేరియన్ స్టిమ్యులేషన్ - అండాల ఉత్పత్తి పెంచడం: సాధారణంగా ప్రతి నెలలో ఒకే ఒక్క అండం పరిపక్వము (Mature) అవుతుంది. కానీ, ఎగ్ ఫ్రీజింగ్ కోసం ఎక్కువ అండాలు అవసరం. అందుకోసం మహిళకు 8 నుండి 12 రోజులు వరకు రోజూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటిని “ఒవేరియన్ స్టిమ్యులేషన్” అంటారు.
ఈ ఇంజెక్షన్ల వల్ల ఒకే నెలలో 10–20 వరకు అండాలు తయారవుతాయి. ఈ సమయంలో బ్లడ్ టెస్టులు, స్కానింగ్‌లు చేయడం ద్వారా అండాల పెరుగుదలపై నిరంతరం పరిశీలన కొనసాగుతుంది.
Step 3: ట్రిగ్గర్ ఇంజెక్షన్: అండాలు పరిపక్వ దశకు చేరినప్పుడు, తుది దశగా "ట్రిగ్గర్ షాట్" (హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్– GCG) ఇస్తారు. ఇది అండాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ట్రిగ్గర్ ఇచ్చిన 34–36 గంటల తరువాత ఎగ్ రెట్రీవల్ చేస్తారు.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ చేయకముందు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రిస్కులు
Step 4: ఎగ్ రెట్రీవల్ (Egg Retrieval): ఇది చిన్న శస్త్రచికిత్సే కానీ అత్యంత సురక్షితమైన పద్ధతిలో చేయబడుతుంది. చిన్న సెడేషన్ ఇస్తారు. ఆపై వజైన ద్వారా సన్నని సూదితో అండాశయాల్లోని పరిపక్వమైన అండాలను బయటకు తీస్తారు. దీన్ని "Transvaginal Ultrasound Aspiration" అంటారు. ఇది 20–30 నిమిషాల్లో పూర్తవుతుంది.
Step 5: ఫ్రోజింగ్ ప్రక్రియ (Cryopreservation): సేకరించిన అండాలను "విట్రిఫికేషన్ టెక్నాలజీ" అనే అత్యాధునిక విధానంతో -196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో లిక్విడ్ నైట్రోజన్ ద్వారా నిల్వ చేస్తారు. ఇది అండాలను డ్యామేజ్ కాకుండా, అదే నాణ్యతతో భద్రంగా ఉంచుతుంది. అలానే ఈ ఎగ్స్ 10–15 ఏ ళ్ళ వరకు కూడా నిల్వ ఉంచే అవకాశం ఉంటుంది.
Step 6: భవిష్యత్‌లో ఎగ్ ఉపయోగం: మహిళ తన జీవితంలో తర్వాతి దశలో గర్భం కోరుకున్నప్పుడు, నిల్వ చేసిన అండాలను ఉపయోగించి, IVF (In Vitro Fertilization) ద్వారా పురుషుని వీర్యంతో కలిపి ఎంబ్రయో తయారు చేస్తారు. ఆ ఎంబ్రయోను గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ entire ప్రక్రియను ఫెర్టిలిటీ నిపుణులు పర్యవేక్షిస్తారు.
ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళల భవిష్యత్తు తల్లితనాన్ని భద్రంగా నిల్వ ఉంచే మార్గం. ప్రత్యేకించి వృత్తిపరంగా బిజీగా ఉన్నవారు, ఆలస్యంగా పెళ్లి చేసుకునే వారు, కాన్సర్ చికిత్సలో ఉన్నవారు మొదలైనవారికి ఇది ఒక బంగారు అవకాశంగా చెప్పవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియలో ఏ దశలోనైనా, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. మీకు సరైన సలహా కావాలంటే ఫెర్టిలిటీ స్పెషలిస్టుతో సంప్రదించండి.
Also Read: భవిష్యత్తులో తల్లికావాలంటే ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయాలి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility