Egg Freezing Health Risks: ఎగ్ ఫ్రీజింగ్ (Egg Freezing) అనే ప్రక్రియ అనేది సాంకేతికంగా అభివృద్ధి చెందిన సురక్షితమైన పద్ధతి. ఇది భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అవ్వాలనే మహిళలకు ఒక మంచి ఆప్షన్‌గా మారింది. అయితే, ఇది పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ లేని విధానం కాదని గుర్తుంచుకోవాలి. ప్రతి మెడికల్ ప్రొసీజర్ కి ఉండే చిన్నపాటి రిస్కులు, జాగ్రత్తలు ఉంటాయి.
ఎగ్ ఫ్రీజింగ్ లో ఉండే మైనర్ రిస్కులు:
1. ఓవరీ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS): ఎగ్ ఫ్రీజింగ్ కోసం డాక్టర్ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. కొంతమంది మహిళల్లో ఈ మందులకు ప్రతికూల ప్రతిస్పందన ఉండొచ్చు. వీటివల్ల కడుపులో నొప్పి, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
2. చిన్నపాటి బ్లీడింగ్ లేదా ఇన్ఫెక్షన్: ఎగ్ తీయడంలో వాడే సూదుల వల్ల కొన్ని సందర్భాల్లో చిన్నపాటి రక్తస్రావం, తేలికపాటి ఇన్ఫెక్షన్ రావచ్చు. అయితే ఇవి అత్యంత అరుదుగా జరుగుతాయి.
3. డబ్బు ఖర్చు - మానసిక ఒత్తిడి: ఈ ప్రక్రియ ఖర్చుతో కూడినది. చాలామంది మహిళలకు ఆర్థికంగా బరువయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రీట్మెంట్ సమయంలో అనేక హార్మోన్ టెస్టులు, ఇంజెక్షన్లు, డాక్టర్ కన్సల్టేషన్స్ ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ గర్భధారణను ఎలా సులభతరం చేస్తుంది?
4. ఎగ్ నాణ్యతపై ప్రభావం: వయస్సు పెరిగే కొద్దీ ఎగ్స్ యొక్క నాణ్యత తగ్గిపోతుంది. వయస్సు ఎక్కువయ్యాక ఫ్రీజ్ చేయడం వల్ల ఎగ్ నాణ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే సమయానుకూలంగా ఎగ్ ఫ్రీజ్ చేయడం అవసరం.
5. 100% గ్యారంటీ ఉండదు: ఎగ్ ఫ్రీజింగ్ వల్ల గర్భధారణకు అవకాశం పెరగవచ్చు కానీ ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పలేం. ఎగ్ ను ఫ్రీజ్ చేయడం, తిరిగి వాడడం, ఎంబ్రియో రూపంలో తయారు కావడం.. ఇవన్నీ వేర్వేరు దశలు, ప్రతిదీ సక్సెస్ కావాలి.
6. అలర్జీ, తలనొప్పి వంటి తాత్కాలిక ఇబ్బందులు: ఇంజెక్షన్ల వల్ల కొంతమందికి తల నొప్పి, మూడ్ స్వింగ్స్, చర్మంపై మార్పులు వంటి తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు.
ఎగ్ ఫ్రీజింగ్ అనేది రీసెర్చ్ మరియు టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చెందిన సురక్షితమైన పరిష్కారం. అయితే కొన్ని మైనర్ రిస్కులు, హార్మోనల్ మార్పులు, ఖర్చు, ఫలితంపై భరోసా ఉండకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఈ ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నట్లయితే, అనుభవజ్ఞుడైన ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సలహా తీసుకుని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయడం ఉత్తమం.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ కి ముందు చేసే ట్రీట్మెంట్‌లు ఏవి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility