Egg Freezing Medications: ఎగ్ ఫ్రీజింగ్ (Egg Freezing) ప్రక్రియలో ముందుగా కొన్ని ముఖ్యమైన వైద్య దశలు ఉంటాయి. ఇవి ఎగ్‌లు మెచ్యూర్‌గాను, ఆరోగ్యకరంగాను తయారవ్వడానికి సహాయపడతాయి:
1. హార్మోన్ ఇంజెక్షన్లు: మొదటగా, స్త్రీకి రోజూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. ఇవి ఓవరీల్లో ఎక్కువ ఎగ్‌లను ఉత్పత్తి చేసేందుకు సహాయపడతాయి. సాధారణంగా ఇది 8–14 రోజులు కొనసాగుతుంది.
2. ఫోలికల్ మానిటరింగ్: హార్మోన్ మందుల ప్రభావాన్ని పరిశీలించేందుకు ట్రాన్స్‌వజైనల్ స్కానింగ్‌లు చేస్తారు. ఫోలికల్స్ ఎగ్‌లతో పాటు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తారు.
3. బ్లడ్ టెస్టులు: ఈస్ట్రోజన్, LH, FSH వంటి హార్మోన్ స్థాయిలను టెస్టులు ద్వారా గమనిస్తారు.
4. Egg Maturation Trigger: ఫోలికల్స్ తగిన Maturation స్టేజ్ కి వచ్చాక, ఓవ్యులేషన్‌ను ట్రిగ్గర్ చేయడానికి ప్రత్యేకమైన ఇంజెక్షన్ (HCG ట్రిగ్గర్) ఇస్తారు.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయించుకోవడం బెస్ట్?
5. Egg Retrieval (ఎగ్‌లను సేకరించడం): ట్రిగ్గర్ ఇచ్చిన 34-36 గంటల తర్వాత, ఒక చిన్న సర్జరీ ద్వారా ఓవరీల నుంచి ఎగ్‌లను సేకరిస్తారు. ఇది సుమారు 15-20 నిమిషాలు మాత్రమే పడుతుంది.
6. విశ్రాంతి: ఎగ్ రిట్రీవల్ అనంతరం 1–2 రోజులు పూర్తిగా విశ్రాంతిగా ఉండాలి. గర్భాశయం మళ్లీ సహజ స్థితికి రావడానికి కొంత సమయం అవసరం.
7. ఎగ్‌లను ఫ్రీజ్ చేయడం: సేకరించిన ఆరోగ్యకరమైన ఎగ్‌లను ప్రత్యేకమైన విధానంతో (-196°C) క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరుస్తారు.
ఎగ్ ఫ్రీజింగ్ ముందు జరిపే ఈ ట్రీట్మెంట్ ప్రక్రియ వైద్యుల పర్యవేక్షణలో జరగాలి. ఇది పూర్తిగా సురక్షితమైనదే కానీ వ్యక్తుల ఆరోగ్య స్థితిని బట్టి మారవచ్చు. ఎప్పుడూ ఫెర్టిలిటీ స్పెషలిస్టుతో సంప్రదించి ప్రారంభించాలి.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ గర్భధారణను ఎలా సులభతరం చేస్తుంది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility