Early signs of PCOD: PCOD (పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్) అనేది చాలా మంది యువతిలో కనిపించే సామాన్యమైన హార్మోనల్ సమస్య. ఇది ప్రధానంగా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. PCOD ఉన్నప్పుడు అండాశయాల్లో చిన్న చిన్న సిస్టులు (పిండాలు) ఏర్పడతాయి. ఇవి కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ పై ప్రభావితం చూపుతాయి, గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఈ సమస్యను గుర్తించడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన లక్షణాలు కనిపించవు. అయితే సాధారణంగా PCOD ఉన్న వారు పీరియడ్స్ తరచుగా ఆలస్యం కావడం లేదా పూర్తిగా రాకపోవడం, బరువు పెరగడం, ముఖం మీద మొటిమలు, గడ్డం భాగంలో వెంట్రుకలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఉబ్బసం, అలసట, ఒత్తిడి కూడా బాధించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
PCOD ను నిర్ధారించడానికి సాధారణంగా బ్లడ్ టెస్టులు (హార్మోన్ల పరీక్షలు), అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తారు. ఈ పరీక్షల ద్వారా అండాశయాల పరిమాణం, అందులోని సిస్టుల సంఖ్య వంటి వివరాలు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా PCOD కారణంగా ఉంటుంది, అందుకే డాక్టర్ సూచనల మేరకు అన్ని టెస్టులు చేయించుకోవడం అవసరం.
Also Read: IVF ట్రీట్మెంట్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది?
చికిత్స పరంగా ప్రారంభ దశలో లైఫ్ స్టైల్ లో మార్పులు చాలా అవసరం. మంచి డైట్ తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి వాటి ద్వారా PCODని సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు. మందులు లేదా హార్మోన్ టాబ్లెట్లు డాక్టర్ సూచించిన విధంగా వాడితే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.
PCODతో బాధపడే వారు నిరాశ పడకూడదు. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, మందులతో దీనిని కంట్రోల్ చేయవచ్చు. దీన్ని పట్టించుకోకపోతే గర్భధారణలో సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, హార్ట్ డిసీజ్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కనుక తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడమే ఉత్తమ మార్గం.
Also Read: ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి మూడు నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility