First Trimester of Pregnancy: ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు (ఫస్ట్ ట్రైమెస్టర్) ప్రతి మహిళ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. ఈ సమయంలో పిండం అన్ని ముఖ్యమైన అవయవాలను అభివృద్ధి చేసుకుంటుంది.
కనుక ఈ సమయంలో తల్లి తీసుకునే ఆహారం, ఆరోగ్యపు అలవాట్లు, మానసిక స్థితి అన్నీ భవిష్యత్ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
1. సరిగ్గా పోషకాహారాన్ని తీసుకోవాలి: ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్-D, B12 వంటి పోషకాలు ఈ దశలో తప్పనిసరిగా అవసరం. ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా బేబీ మెదడు, స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్‌కు అవసరం. ఆకుకూరలు, పప్పులు, గింజలు, పండ్లు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి.
2. హానికరమైన పదార్థాలు దూరంగా పెట్టాలి: మద్యం, పొగ త్రాగటం, అధిక క్యాఫిన్ (కాఫీ, టీ) తీసుకోవడం వంటివి పిండం అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతాయి. ఇవన్నీ పూర్తిగా నివారించాలి. కొన్ని రకాల ఔషధాలు కూడా గర్భానికి హానికరం కావచ్చు కనుక ఏ మందులు వాడినా ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
3. స్ట్రెస్ ఫ్రీ గా ఉండాలి: మానసిక ఆరోగ్యాన్ని పక్కాగా చూసుకోవాలి. టెన్షన్, భయం, ఒత్తిడి వంటి భావాలు గర్భంలో పెరుగుతున్న బిడ్డకు మంచివి కావు. యోగా, ధ్యానం వంటి చర్యలతో మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు. తేలికపాటి వాకింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీ మంచిదే కాని బరువు మోసే పనులు, ఎక్కువగా ప్రయాణాలు తగదు.
4. రెగ్యులర్‌గా డాక్టర్ సూచించిన టెస్ట్‌లు చేయించుకోవాలి: ప్రెగ్నెన్సీ ని కన్ఫర్మ్ చేసిన తర్వాత వెంటనే గైనకాలజిస్టుని సంప్రదించి ప్రాథమిక బ్లడ్ టెస్ట్‌లు, యూరిన్ టెస్ట్‌లు, స్కానింగ్‌లు చేయించుకోవాలి. గర్భసంచి స్థితి, హార్మోన్ స్థాయిలు, Hb, థైరాయిడ్ మొదలైన అంశాలను డాక్టర్ పరిశీలిస్తారు. అవసరమైనంత కాలం ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్లు వాడాలి.
Also Read: ఎగ్స్ క్వాలిటీ ను పెంచుకోవడం ఎలా?
5. వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు సహజం: ఈ సమయంలో కొందరిలో ఉదయం వాంతులు (మార్నింగ్ సిక్నెస్), అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవి సాధారణమే అయినప్పటికీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. తక్కువ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినడం, నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.6. లైఫ్ స్టైల్ మరియు నిద్రపై శ్రద్ధ: రాత్రికి కనీసం 7–8 గంటల నిద్ర అవసరం. బలహీనత, తలనొప్పులు, అలసట వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక తగిన విశ్రాంతిని తీసుకోవాలి. ఎక్కువ సమయం ఫోన్లు, టీవీ స్క్రీన్లను చూసే అలవాట్లు తగ్గించాలి.
మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీ పునాదిని వేసే దశ. ఈ సమయంలో తీసుకునే జాగ్రత్తలు గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి బలమైన బేస్ ఇస్తాయి. కనుక సరిగ్గా ఆహారం, వ్యాయామం, మెడికల్ కేర్, మానసిక ప్రశాంతతపై ఫోకస్ చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన గర్భధారణ సాధ్యమవుతుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
Also Read: స్పెర్మ్ కౌంట్‌ని పెంచే టాప్ ఫుడ్స్
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility