Best Foods for Male Fertility: స్పెర్మ్ కౌంట్‌ని పెంచే టాప్ ఫుడ్స్ - Pozitiv Fertility - Hyderabad

Best Foods for Male Fertility: ఈ మధ్య కాలంలో అనారోగ్యకర జీవనశైలి, ఒత్తిడి, హార్మోనల్ సమస్యల కారణంగా చాలా మంది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఇది గర్భధారణలో అంతరాయం కలిగించే ప్రధాన కారణాల్లో ఒకటి. అయితే మంచి ఆహారపు అలవాట్లతో స్పెర్మ్ కౌంట్‌ను సహజంగా మెరుగుపరచవచ్చు. ప్రత్యేకంగా కొన్ని ఫుడ్స్, స్పెర్మ్ కౌంట్, క్వాలిటీను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఆ టాప్ ఫెర్టిలిటీ బూస్టింగ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుడ్లు (Eggs): గుడ్లలో హై ప్రొటిన్‌తో పాటు విటమిన్ ఇ, జింక్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

2. వాల్‌నట్స్ Walnuts: ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు అధికంగా ఉండే వాల్‌నట్స్ స్పెర్మ్ మోటిలిటీని (తేలికగా కదలే లక్షణం) మెరుగుపరచడంలో సహకరిస్తాయి. రోజూ వాల్‌నట్స్ తినడం మంచిది.

3. తేనెతో కలిపిన అల్లం (Ginger with honey): అల్లం స్పెర్మ్ హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. తేనెతో కలిపి తీసుకుంటే శక్తిని ఇస్తుంది మరియు ఫెర్టిలిటీ బాగా మెరుగవుతుంది.

4. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్: ఇవి ఫోలిక్ యాసిడ్స్ తో నిండి ఉంటాయి. ఫోలేట్ స్థాయిలు తక్కువగా ఉంటే స్పెర్మ్ అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి. అందుకే ఆకుకూరలు స్పెర్మ్ ఆరోగ్యానికి అవసరం.

5. బాదం, పిస్తా, క్యాష్యూ (Nuts): ఇవి విటమిన్ ఇ, జింక్ మరియు సెలీనియం వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచి స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయి.

Also Read: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న పురుషులకు IUI ఎలా సహాయపడుతుంది? 

6. టొమాటోలు (Tomatoes): టొమాటోల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ పెంచుతుంది. రోజూ టొమాటో జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది.

7. జింక్ రిచ్ ఫుడ్స్ (Pumpkin seeds, Whole grains): జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలు స్పెర్మ్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. జింక్ తక్కువగా ఉంటే టెస్టోస్టెరోన్ స్థాయిలు పడిపోతాయి.

8. డార్క్ చాక్లెట్: ఇందులో ఉండే అర్జినైన్ అనే అమైనో యాసిడ్ స్పెర్మ్ కౌంట్‌ను, శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ, మితంగా మాత్రమే తీసుకోవాలి.

9. నెయ్యి (Desi Ghee): ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. రోజూ 1 స్పూన్ నెయ్యిని వాడడం వల్ల ఆరోగ్యానికీ, ఫెర్టిలిటీకీ మేలు జరుగుతుంది.

10. తాజా పండ్లు (Citrus fruits, Bananas, Pomegranates): విటమిన్ సి, బి12, మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఇవి స్పెర్మ్స్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. ముఖ్యంగా దానిమ్మ రక్తప్రసరణను మెరుగుపరచి ఫెర్టిలిటీని పెంచుతుంది.

స్పెర్మ్ కౌంట్‌ను పెంచాలంటే జంక్ ఫుడ్, అల్కహాల్, ధూమపానం నివారించి పౌష్టిక ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, ఈ టాప్ ఫుడ్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే సహజంగా ఫెర్టిలిటీ మెరుగవుతుంది. డాక్టర్ సలహాతో ఇతర చికిత్సలు కూడా పరిశీలించవచ్చు.

Also Read: First Time IUI Try చేస్తున్న జంటలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post