First Time IUI Try చేస్తున్న జంటలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు - Pozitiv Fertility - Hyderabad

IUI Success Tips for First Timers: IUI (Intrauterine Insemination) మొదటిసారి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా సందేహాలు, భయాలు ఉండటం సహజం. ఈ చికిత్స ఎలా జరుగుతుంది? ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? విజయవంతం కావాలంటే ఏం పాటించాలి? అనే అన్ని ముఖ్యమైన విషయాల గురించి ముందుగానే అవగాహన ఉండటం చాలా అవసరం.

IUI టైమింగ్ ఎందుకు ముఖ్యం?

IUI ట్రీట్మెంట్‌లో అత్యంత కీలకమైన అంశం "ఒవ్యూలేషన్ టైమింగ్." అంటే అండం విడుదలవుతున్న టైమ్‌ను ఖచ్చితంగా తెలుసుకోవడం. అండం విడుదలైన 12 నుండి 24 గంటల వ్యవధిలో స్పెర్మ్‌ని గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తే గర్భం రావడానికి అవకాశం ఎక్కువ. అందుకే కొన్ని సందర్భాల్లో HCG Trigger Injection వాడుతూ డాక్టర్లు టైమింగ్‌ను కంట్రోల్ చేస్తారు.

IUI Natural Cycle vs Stimulated Cycle

IUI రెండు రకాలుగా చేస్తారు. ఒకటి - మీ నేచురల్ సైకిల్‌లోనే. రెండవది – హార్మోన్ మందులతో అండం విడుదల అయ్యేట్టు చేసి, అప్పుడు IUI చేయడం. కొన్ని మహిళల్లో ఒవ్యూలేషన్ జరగకపోవడం, లేదా అండం చిన్నదిగా ఉండటం వంటివి ఉంటే, stimulated cycleను సూచిస్తారు. డాక్టర్ సూచన మేరకు ఏ విధానమైతే మీకు మంచిదో అదే ఫాలో అవ్వాలి.

Also Read: IUI సక్సెస్ రేట్ పెంచే మార్గాలు

IUI Success Rate ఎంత?

IUI success rate సాధారణంగా 10% నుంచి 20% మధ్యే ఉంటుంది – వయస్సు, స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ హెల్త్, హార్మోనల్ కండిషన్ మీద ఆధారపడి. కానీ, 3 నుండి 4 cycle ల్లో 40% దాకా chances ఉంటాయి. వయస్సు 30 లోపు ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి.

IUI తర్వాత గర్భధారణ జరిగినట్లు ఎలా తెలుసుకోవాలి?

IUI చేసిన 14 రోజుల తర్వాత pregnancy test చేయాలి. తక్కువ బ్లీడింగ్ (implantation spotting), ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ ఇవి confirmatory కాదు. కచ్చితంగా పరీక్ష చేయించాలి.

IUI తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

- ట్రీట్మెంట్ జరిగిన రోజున శాంతిగా విశ్రాంతి తీసుకోవడం మంచిది.

- మితమైన వాకింగ్, రోజువారీ పనులు చెయ్యొచ్చు.

- తీవ్రమైన వ్యాయామం, హీట్ థెరపీ లాంటివి చేయకూడదు.

- హార్మోన్ మందులు ఇస్తే టైమ్ కి తీసుకోవాలి.

IUI అనేది “సరళమైన టెక్నాలజీతో పెద్ద ఆశ” కలిగించే మార్గం. ఇది IVF కన్నా మొదటి మెట్టు. కొందరికి ఇది ఒక్క సైకిల్‌ లోనే ఫలితాన్ని ఇస్తే, మరికొందరికి ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరం అవుతాయి. కానీ నమ్మకంతో, వైద్యుల సూచనలతో ముందుకు సాగితే తల్లిదండ్రుల కావడమే కాదు.. ఆ అనుభూతి విలువను మీరు తప్పకుండా అనుభవిస్తారు.

Also Read: Lesbian జంటలకు తల్లిదండ్రులయ్యే అవకాశం

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post