Lesbian జంటలకు తల్లిదండ్రులయ్యే అవకాశం! - Pozitiv Fertility - Hyderabad

Lesbian Pregnancy: IUI అంటే Intrauterine Insemination. ఇది సహజసిద్ధమైన గర్భధారణ సాధ్యపడకపోయే దంపతులకు అందించే ఒక సాధారణ, తక్కువ invasive మరియు తక్కువ ఖర్చు గల ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్. ఇందులో పురుషుని స్పెర్మ్ ను శుద్ధి చేసి, నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా స్పెర్మ్ ఎగ్‌ దాకా చేరే దూరం తగ్గుతుంది. ఫెర్టిలైజేషన్‌ జరిగే అవకాశం పెరుగుతుంది. హార్మోన్ మందులు ఇచ్చి అండాల ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు, అండోత్సర్గ సమయానికి స్పెర్మ్ insemination చేస్తారు.

ఇది ఎలా పనిచేస్తుంది?

మహిళకి హార్మోన్ ఇంజెక్షన్లు లేదా మందులు ఇచ్చి అండాల ఎదుగుదలను పెంచుతారు. 10వ రోజు నుంచి అల్ట్రాసౌండ్ ద్వారా ఎగ్‌ ఎదుగుదలను ట్రాక్ చేస్తారు. అండోత్సర్గ (Ovulation) జరగబోయే సమయాన్ని గుర్తించి, పురుషుని నుండి స్పెర్మ్ సేకరించి శుద్ధి చేసి, స్పెషల్ కాథెటర్ సహాయంతో గర్భాశయంలోకి నేరుగా ప్రవేశపెట్టుతారు. దీన్ని IUI అంటారు. ఇది చాలా తక్కువ సమయంలో జరిగే, సాదాసీదా ప్రక్రియ.

Also Read: ప్రెగ్నెన్సీ కోసం చేసే IUI చికిత్సలో వీర్యాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసా? 

సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది?

IUI సక్సెస్ రేట్ పూర్తిగా మహిళ వయసు, ఎగ్‌ క్వాలిటీ, స్పెర్మ్ మోటిలిటీ, మరియు హార్మోన్ల స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్లు లోపు మహిళల్లో సక్సెస్ రేట్ 15-20% ఉండవచ్చు. వయసు పెరిగే కొద్దీ శాతం తగ్గుతుంది. సాధారణంగా 3 IUI సైకిల్స్ వరకు ప్రయత్నిస్తారు. తరువాత కూడా ఫలితం రాకపోతే IVF వైపు వెళ్తారు. అయితే తొలిసారి చేస్తే విజయవంతం కాకపోవచ్చు. ఓర్పుతో, సరైన వైద్య పర్యవేక్షణలో కొనసాగితే గర్భధారణ సాధ్యమే.

నొప్పి లేదా ఇబ్బంది ఉందా?

IUI ప్రక్రియ సమయంలో సాధారణంగా తీవ్రమైన నొప్పి ఉండదు. ఇది సాధారణ గైనెక్ పరీక్షల లానే ఉంటుంది. కేవలం కాథెటర్ ద్వారా స్పెర్మ్ ఇంజెక్ట్ చేసే సమయంలో కొద్దిగా అసౌకర్యంగా అనిపించవచ్చు. కొందరికి చికిత్స తర్వాత కొద్దిగా bloating, cramps ఉండొచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికమే.

ఎవరు IUI కి సరిపోతారు?

- లేతమైన స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ ఉండేవారు

- అండోత్సర్గ సమస్యలు ఉన్న మహిళలు

- PCOS ఉన్నవారు

- అన్‌ఎక్స్‌ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ

- లెస్బియన్ జంటలు, single mothers planning through donor sperm

అయితే ఫాలోపియన్ ట్యూబ్స్ పూర్తిగా బ్లాక్ అయినవారు, తీవ్రమైన ఎండోమెట్రియోసిస్ ఉన్నవారు, చాలా తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు IUIకి సరిపోరు. వారు IVF/ICSI ట్రీట్‌మెంట్ వైపు వెళ్ళాలి.

ఖర్చు, రోజులు, జాగ్రత్తలు?

IUI ఖర్చు సాధారణంగా ₹7,000 – ₹20,000 వరకు ఉంటుంది. మందుల ధర, హార్మోన్ ఇంజెక్షన్లు, స్కాన్లు అదనంగా ఉంటాయి. కొంతమంది క్లినిక్స్ లో డోనర్ స్పెర్మ్ ఉపయోగించినా ఖర్చు పెరుగుతుంది. IUI తర్వాత ఒకటి రెండు రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం, ప్రొజెస్టెరోన్ మాత్రలు తీసుకోవడం ద్వారా గర్భధారణకు మరింత అవకాశం పెరుగుతుంది. ఫలితాన్ని తెలుసుకోవడానికి 14 రోజులకు హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చు.

IUI అనేది ఒక హోప్ ప్రాసెస్. ఇది IVF ముందు దంపతులకు ఇచ్చే తొలి ప్రయత్నంగా భావించవచ్చు. తక్కువ ఖర్చు, తక్కువ శారీరక ఒత్తిడి కలిగించే ఈ ప్రక్రియ చాలామందికి ఫలితాలు ఇస్తోంది. అయితే అది ఒక్కసారి చేయగానే ఫలితం వస్తుంది అన్న నమ్మకం వద్దు. సరైన వైద్య పర్యవేక్షణ, సైకల్స్ ని ఓర్పుతో తీసుకుంటే, IUI ద్వారా మీరు గర్భధారణ సాధించవచ్చు.

Also Read: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న పురుషులకు IUI ఎలా సహాయపడుతుంది?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post