IUI vs IVF: ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్ లో అసలు తేడా ఏంటి? - Pozitiv Fertility - Hyderabad

IUI vs IVF: IUI అంటే Intrauterine Insemination. ఇది స్పెర్మ్‌ను శుభ్రపరచి, గర్భాశయంలోకి నేరుగా ఇంజెక్ట్ చేసే ట్రీట్‌మెంట్. సహజ గర్భధారణకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఖర్చు తక్కువ, సింపుల్ ప్రాసెస్. ముఖ్యంగా మొదటి ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌గా డాక్టర్లు ఇది సజెస్ట్ చేస్తారు.

IVF అంటే In-vitro Fertilization. ఇందులో ఎగ్ మరియు స్పెర్మ్ ల్యాబ్‌లో కలిపి ఎంబ్రియోగా తయారు చేసి, తర్వాత గర్భాశయంలోకి మారుస్తారు. ఇది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కానీ ఖరీదు ఎక్కువ. ఎక్కువ హార్మోన్ ఇంజెక్షన్లు అవసరం.

IUI సమయంలో డైట్, జాగ్రత్తలు IUI ప్లాన్ చేస్తున్న సమయంలో ఆరోగ్యకరమైన డైట్ చాలా అవసరం. ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ D ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్స్ మరియు మంచి ఫ్యాట్స్ తీసుకుంటే హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది. శారీరక వ్యాయామం మితంగా చేయాలి. ఆల్కహాల్, సిగరెట్, అధిక కెఫిన్ తగ్గించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం కూడా చాలా ముఖ్యమైనది.

Also Read: Lesbian జంటలకు తల్లిదండ్రులయ్యే అవకాశం

సైకిల్ కు ముందు – మెడికల్ ప్రిపరేషన్ IUI ప్రారంభానికి ముందు, కొన్ని రక్తపరీక్షలు, హార్మోన్ టెస్టులు, HSG (ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదా పరీక్ష) వంటివి చేస్తారు. స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్, మోటిలిటీ చూస్తారు. ఎగ్ రిజర్వ్ పరీక్షలు కూడా చేస్తారు. ఇవన్నీ బాగుంటే, IUIకు లైన్ క్లియర్. Donor Sperm తో IUI – ఇది ఎప్పుడు చేస్తారు? కొందరికి స్వంతంగా స్పెర్మ్ అందుబాటులో లేకపోతే, సర్టిఫైడ్ డోనర్ స్పెర్మ్ ఉపయోగించి IUI చేస్తారు. ఇది ముఖ్యంగా సింగిల్ మహిళలు, లెస్బియన్ కపుల్స్, లేదా azoospermia (Zero sperm count) ఉన్నవారికి ఉపయోగపడుతుంది. అన్ని లీగల్ ప్రోటోకాల్ లతో డోనర్ స్పెర్మ్ ప్రయోగం జరుగుతుంది. IUI ఫెయిల్ అయినా వెంటనే దిగులుపడకండి ఒకసారి IUI చేయగానే గర్భం రాదు. చాలా సందర్భాల్లో 3 IUI సైకిల్స్ వరకు ప్రయత్నించాల్సి ఉంటుంది. కొంత మందికి మొదటి సైకిల్‌లోనే ఫలితం వస్తే, ఇంకొందరికి 2వ లేదా 3వ సైకిల్‌ అవసరం అవుతుంది. దాంతో పాటు హార్మోన్ మందుల ప్రాముఖ్యత, డైట్, మానసిక నిబ్బరం కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.


IUI అనేది గర్భధారణ వైపు వేసే తొలి అడుగు. ఇది భద్రమైనది, తక్కువ ఖర్చుతో కూడినది, మానసికంగా పెద్దగా ఒత్తిడి ఇవ్వని ప్రక్రియ. సరైన వైద్యుల పర్యవేక్షణలో ప్లాన్ చేస్తే, IUI ట్రీట్‌మెంట్ ద్వారా మీరు తల్లిదండ్రులు అవ్వొచ్చు. ప్రస్తుత కాలంలో ఎన్నో ఫెర్టిలిటీ క్లినిక్స్ IUIని విజయవంతంగా చేస్తూ, లక్షల మందికి ఆశ కలిగిస్తున్నాయి.

Also Read: ప్రెగ్నెన్సీ కోసం చేసే IUI ట్రీట్మెంట్ Painful గా ఉంటుందా?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post