ప్రెగ్నెన్సీ కోసం చేసే IUI ట్రీట్మెంట్ Painful గా ఉంటుందా? - Pozitiv Fertility- Hyderabad
IUI (ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్) ట్రీట్మెంట్ సాధారణంగా ఎక్కువగా నొప్పి అనిపించదు. ఇది ఒక చిన్న, తక్కువ సమయంలో పూర్తయ్యే ప్రొసీజర్. చాలామంది మహిళలు ఈ ట్రీట్మెంట్‌ను అసౌకర్యం లేకుండానే అనుభవిస్తారు. కానీ, కొంతమందికి ఈ ప్రొసీజర్ సమయంలో స్వల్ప అసౌకర్యం అనిపించవచ్చు, కానీ ఇది తీవ్రమైన నొప్పిగా ఉండదు.
ప్రొసీజర్ సమయంలో శుభ్రపరచిన స్పెర్మ్‌ను ఒక చిన్న క్యాథెటర్ (సన్నని ట్యూబ్) ద్వారా గర్భాశయంలోకి పంపిస్తారు. క్యాథెటర్ ప్రవేశపెట్టే సమయంలో కొంతమంది మహిళలకు కడుపు కింద భాగంలో అసౌకర్యం, చిన్నపాటి నొప్పి అనిపించొచ్చు. ఇది మెన్‌స్ట్రువల్ క్రాంప్స్ లా అనిపించవచ్చు, కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
సాధారణంగా IUI ప్రక్రియ పూర్తయ్యాక కొన్ని గంటల నుంచి ఒక రోజు వరకు చిన్న క్రాంప్స్, లేత రక్తస్రావం (spotting) వంటి సమస్యలు ఉండవచ్చు. అయితే ఇవి సాధారణమే మరియు కొన్ని గంటల్లో నుంచే తగ్గిపోతాయి. ప్రొసీజర్ తర్వత పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం మంచిది..
IUI ట్రీట్మెంట్ చాలా సురక్షితమైనది. మినిమల్లీ ఇన్వేసివ్, తక్కువ నొప్పితో కూడిన ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. ఏమైనా అసాధారణ నొప్పి, తీవ్రమైన రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility