స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న పురుషులకు IUI ఎలా సహాయపడుతుంది? - Pozitiv Fertility- Hyderabad

IUI అంటే ఏమిటి?

IUI అంటే Intrauterine Insemination. ఇది సహజసిద్ధమైన గర్భధారణ సాధ్యపడకపోయే దంపతులకు అందించే ఒక సాధారణ, తక్కువ ఇన్వేసివ్ మరియు తక్కువ ఖర్చు గల ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్. ఇందులో పురుషుని స్పెర్మ్ ను శుద్ధి చేసి, నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా స్పెర్మ్ ఎగ్‌ దాకా చేరే దూరం తగ్గుతుంది. ఫెర్టిలైజేషన్‌ జరిగే అవకాశం పెరుగుతుంది. హార్మోన్ మందులు ఇచ్చి అండాల ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు, అండోత్సర్గ సమయానికి స్పెర్మ్ insemination చేస్తారు.

ఇది ఎలా పనిచేస్తుంది?

IUI ప్రక్రియలో, పురుషుడి వీర్యాన్ని సేకరించి, దానిని శుద్ధి చేసి అందులోని ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ను మాత్రమే వేరుచేస్తారు. అనంతరం, ఓవులేషన్ టైమ్ దగ్గరగా (గర్భధారణకు అనుకూలమైన సమయం) గర్భాశయంలోని ఎండోమెట్రియం లోపల, అదే ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ను ఒక సన్నని ట్యూబ్ ద్వారా నేరుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల స్పెర్మ్ నేరుగా ఎగ్‌ ని ఫెర్టిలైజ్ చేయడానికి అవకాశాలు పెరుగుతాయి.

IUI చేయడానికి ముందు తీసుకునే జాగ్రత్తలు:

IUI ప్రక్రియకు ముందే మహిళకు ఓవులేషన్ జరిగే సమయాన్ని ట్రాక్ చేయడానికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయడం జరుగుతుంది. అవసరమైతే Egg Maturation కోసం Clomiphene Citrate లేదా Letrozole వంటి మందులు కూడా ఇస్తారు.

IUI ఎవరికీ ఉపయోగపడుతుంది?

IUI పద్ధతి ముఖ్యంగా క్రింది పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది:

- పురుషుని స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు

- పురుషుని స్పెర్మ్ మొబిలిటీ బలహీనంగా ఉన్నప్పుడు

- శృంగార సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు

- Cervical mucus సమస్యల వల్ల స్పెర్మ్ ఎగ్ వరకు చేరలేని పరిస్థితిలో

- అన్‌ఎక్స్‌ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ

సహజ గర్భధారణ కి IUI ట్రీట్మెంట్ మధ్య తేడా?

సహజంగా శృంగార సమయంలో వీర్యం వెజైనాలో విడుదల అవుతుంది. అక్కడినుంచి స్పెర్మ్ uterus ద్వారా fallopian tubes కి చేరి ఎగ్‌ని ఫెర్టిలైజ్ చేస్తుంది. కానీ IUI లో ఈ మిడిల్ స్టెప్స్ తొలగించి, స్పెర్మ్ నేరుగా uterus లోకి పోతుంది. ఇది గర్భధారణ ఛాన్స్‌ని మెరుగుపరచే ప్రయత్నం.

IUI ఒక సులభమైన, తక్కువ ఖర్చుతో ఉండే గర్భధారణ సహాయక పద్ధతి. ఇది చాలా మంది దంపతులకు మంచి ఫలితాలు ఇస్తోంది. అయితే, ఇది 100% హామీ ఇచ్చే ప్రక్రియ కాదు. వయసు, హార్మోన్ స్థాయిలు, అండాల ఉత్పత్తి వంటి అంశాలపై విజయం ఆధారపడి ఉంటుంది. డాక్టర్ సూచనల ప్రకారం ముందుకు సాగితే, IUI ద్వారా గర్భధారణ సాధ్యమే.


మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post