PCOS ఉన్నవారికి IUI ఉపయోగమవుతుందా? - Pozitiv Fertility - Hyderabad

PCOS Fertility Treatment: PCOD/PCOS ఉన్న మహిళలకి IUI ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఎందుకంటే PCOD వల్ల సాధారణంగా అండం సక్రమంగా విడుదల కాకపోవడం లేదా ఒవ్యూలేట్ కాకపోవడం జరుగుతుంది. దీనిని హార్మోన్ మందులతో ట్రాక్ చేసి, అండం విడుదల అయ్యినప్పుడు IUI చేస్తే గర్భధారణ అవకాశం పెరుగుతుంది. కానీ కంట్రోల్ చేయని PCOD వల్ల overweight, hormonal imbalance వంటివి ఉంటే ముందుగా వాటిని నార్మల్ స్టేజి కి తీసుకురావడం చాలా ముఖ్యం.

IUI తర్వాత గర్భం రాకపోతే ఏమి చేయాలి?

ఒక cycle తర్వాత వెంటనే ఫలితం రాకపోతే, ఆందోళన చెందాల్సిన పని లేదు. సాధారణంగా 3 నుంచి 6 IUI cycleలు ప్రయత్నించిన తర్వాతే దానిని విజయవంతం లేదా విఫలం అయిందని చెప్పగలం. డాక్టర్ సూచన మేరకు అండాల ఎదుగుదల, స్పెర్మ్ కౌంట్, అండం విడుదల టైమింగ్, ఫాల్లో అప్ స్కాన్లు అన్నింటిని విశ్లేషించి తదుపరి మార్గాన్ని సూచిస్తారు. IUI తర్వాత కూడా గర్భం రాకపోతే IVF వైపు మారడం డాక్టర్ల సలహా ఆధారంగా ఉంటుంది.

IUI కి బెస్ట్ టైమింగ్ ఎప్పుడు?

IUI చేయాల్సిన ఉత్తమ సమయం ఒవ్యూలేషన్ (అండం విడుదల) కి 6 గంటల ముందు నుంచి 6 గంటల లోపే. కొన్నిసార్లు హార్మోనల్ ఇంజెక్షన్ (HCG Trigger) ఇచ్చి అండం విడుదలను కంట్రోల్ చేస్తారు. Ovulation usually happens 36 hours after the trigger shot. అప్పుడు డాక్టర్ సూచించిన సమయానికి IUI చేయడం చాలా ముఖ్యం.

IUI Natural Cycle vs. Medicinal Cycle - ఏది మంచిది?

Natural cycle అనగా - హాస్పిటల్ మందులు లేకుండా, మీ సంతానోత్పత్తి చక్రాన్ని బట్టి చేసే విధానం. ఇది సాధారణంగా రెగ్యులర్ పిరియడ్స్ ఉన్నవారికి work అవుతుంది.

అయితే Medicinal/Stimulated IUI అనేది - హార్మోన్ మందులతో అండాలను పండించి, అప్పుడు IUI చేసే విధానం. ఇది irregular periods ఉన్నవారికి, అండాలు సరైనంత వరకు ఎదగని వాళ్లకు ఉపయోగపడుతుంది.

Also Read: IUI vs IVF: ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్ లో అసలు తేడా ఏంటి? 

Natural Cycle IUI అంటే ఏమిటి?

ఇది పూర్తిగా సహజమైన ఋతు చక్రంపైన ఆధారపడిన పద్ధతి. హార్మోన్ మందులు వాడకుండా, మీ పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండే ఛాన్సు ఉన్నప్పుడు ఈ పద్ధతి ఫలితాలివ్వొచ్చు. ఎలాంటి మెడికల్ స్టిములేషన్ లేకుండా, సహజంగా అండం తయారయ్యే సమయంలో IUI చేయబడుతుంది.

Medicinal/Stimulated IUI అంటే?

ఇది హార్మోన్ మందుల సహాయంతో అండాలు విడుదల అయ్యే విధానం. అండం ఎదుగుదల బాగాలేకపోతే లేదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటే, మందుల సహాయంతో అండాలను మెచ్యూర్ చేయించి, అవసరమైన సమయంలో IUI చేస్తారు. ఈ విధానం irregular periods ఉన్నవారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.

IUI తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

- శారీరక విశ్రాంతి తీసుకోవాలి (ఒకటి రెండు రోజులు).

- మితమైన ఫిజికల్ యాక్టివిటీ చెయ్యవచ్చు కానీ కఠినమైన వ్యాయామాలు నివారించాలి.

- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అత్యంత ముఖ్యం.

- డాక్టర్ సూచించిన హార్మోన్ టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్లు తప్పకుండా ఫాలో కావాలి.

IUI అనేది IVF కన్నా తక్కువ ఖర్చుతో, తక్కువ ఇన్వేసివ్ ట్రీట్మెంట్. ఇది వందలాది కుటుంబాల జీవితాల్లో ఆశను నింపిన పద్దతి. ఒవ్యూలేషన్ ట్రాకింగ్, స్పెర్మ్ వాషింగ్, సరిగ్గా టార్గెట్ చేసిన insemination ఇవన్నీ కలిసే మంచి ఫలితాలు ఇవ్వగలవు. కొన్ని సార్లు ఎక్కువ cycleలు అవసరమవుతాయి. అయినా ఓర్పుతో, నమ్మకంతో ముందుకెళితే విజయావకాశాలు తప్పకుండా ఉంటాయి.

Also Read: ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ రానివారికి ఇది వరం.. IUI అంటే ఏమిటి? What is IUI..?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post