IUI Success Tips: IUI సక్సెస్ రేట్ చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వీటిలో ముఖ్యంగా:
మహిళ వయసు (Age):
- 35 సంవత్సరాల లోపు మహిళల్లో సక్సెస్ 15% నుంచి 20% వరకు ఉంటుంది.
- 35–40 వయసులో సక్సెస్ 10% వరకు పడిపోతుంది.
- 40కి పైగా ఉన్నవారికి IUI సక్సెస్ రేట్ మరింత తక్కువగా ఉంటుంది (5% లోపే).
స్పెర్మ్ కౌంట్ మరియు మొబిలిటీ
- అండాల ఉత్పత్తి (Ovulation quality)
- ఇతర హార్మోనల్ లేదా ట్యూబ్ సమస్యలు లేకపోవడం
IUI ప్రక్రియలో నొప్పి ఉంటుందా?
ఈ ప్రక్రియ సాదాసీదాగా, ఎక్కువగా నొప్పి లేకుండా పూర్తవుతుంది. మినీ గైనెక్ పరీక్ష లాగానే ఉంటుంది. కేవలం స్పెర్మ్ ప్రవేశపెట్టే సమయంలో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ తీవ్రమైన నొప్పి ఉండదు. ప్రక్రియ పూర్తయ్యాక కొద్దిగా bloating, light spotting ఉంటే, అది సాధారణమే.
Also Read: IUI vs IVF: ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్ లో అసలు తేడా ఏంటి?
ఎవరు IUI కి అనర్హులు?
IUI ప్రక్రియను అన్ని కేసులకీ వర్తించదు. కొన్ని పరిస్థితుల్లో ఇది సక్సెస్ ఇవ్వదు:
- ఫాల్లోపియన్ ట్యూబ్‌లు పూర్తిగా బ్లాక్ అయిపోయిన మహిళలు
- తీవ్రమైన ఎండోమెట్రియోసిస్ ఉన్నవారు
- పురుషుని స్పెర్మ్ కౌంట్ అసాధారణంగా తక్కువగా ఉన్న వారు
- గర్భాశయంలో లేదా ఎగ్ ఉత్పత్తిలో తీవ్రమైన లోపాలున్నా
ఈ సందర్భాల్లో IVF, ICSI వంటి అధునాతన టెక్నిక్స్ వైపు వెళ్ళాలి.
IUI ఖర్చు ఎంత అవుతుంది?
భారతదేశంలో IUI ఒక్కసారి ప్రక్రియకు ఖర్చు సుమారుగా ₹7,000 నుంచి ₹20,000 వరకు ఉంటుంది. క్లినిక్, మెడిసిన్స్, హార్మోన్ ఇంజెక్షన్లు, అల్ట్రాసౌండ్ స్కాన్లు ఆధారంగా ఖర్చు మారుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది ఇంకా తక్కువ ఖర్చుతో అందవచ్చు.
ట్రీట్‌మెంట్ తర్వాత ఏమి చేయాలి?
- IUI తర్వాత సంపూర్ణ విశ్రాంతి అవసరం లేదు కానీ మితమైన విశ్రాంతి మంచిది.
- 24–48 గంటల వరకు మానసిక ఒత్తిడి లేకుండా ఉండడం మంచిది.
- డాక్టర్ సూచించిన హార్మోన్ మందులు వాడటం, ఫాలో అప్ స్కాన్లు చేయించుకోవడం అవసరం.
- ఒక వారానికీ 14 రోజులకు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు.
IUI అనేది ప్రాథమికంగా ఉన్నత శ్రేణి గర్భధారణ ప్రక్రియలు ప్రారంభించడానికి ముందు చేసే తొలి ప్రయత్నం. ఇది తక్కువ ఖర్చుతో, తక్కువ ఇన్వేసివ్‌గా ఉండటం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. అయితే ఇది సక్సెస్ అయినా లేదా అన్నది పూర్తిగా మీ శరీర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మానసికంగా ఓర్పుతో ఉండడం, మీ డాక్టర్ సూచనల మేరకు ముందుకు సాగడం అత్యంత ముఖ్యమైనవి.
ఒకసారి IUI ఫెయిల్ అయితే మరోసారి చేయొచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. సాధారణంగా 3 IUI సైకిల్స్ వరకు చేస్తారు. ఆ తర్వాత కూడా గర్భధారణ లేకపోతే, IVF వంటి మెరుగైన టెక్నిక్‌లకు వెళ్లడం అవసరం.
Also Read: ప్రెగ్నెన్సీ కోసం చేసే IUI చికిత్సలో వీర్యాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility