After IUI Precautions: IUI (ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్) ప్రొసీజర్ చేసిన తర్వాత ఎక్కువసేపు బెడ్ రెస్ట్ అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతారు. ట్రీట్మెంట్ సమయంలో ఎటువంటి మేజర్ ఇన్వేసివ్ ప్రొసీజర్ జరగదు కాబట్టి, మహిళలు కొద్ది గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి తమ సాధారణ దినచర్యను కొనసాగించవచ్చు.
Also Read: First Time IUI Try చేస్తున్న జంటలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
అయితే, కొంతమంది మహిళలకు ప్రొసీజర్ తర్వాత స్వల్పంగా కడుపు నొప్పి, అలసట అనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకానీ, పడుకుని ఉండాల్సిన అవసరం లేదు.
ఒకవేళ అసౌక్యం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు ఉంటే వాటిని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడం, ఒత్తిడిని దూరం పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆత్మస్థైర్యం మరియు సానుకూల ఆలోచనలే ఈ సమయంలో చాలా అవసరం. శరీరం సహజ ప్రక్రియలో భాగంగా స్పందించేందుకు ఇది సహకరిస్తుంది. సో, బెడ్ రెస్ట్ కంటే మానసికంగా రిలాక్స్ కావడం, హెల్దీ డైట్ తీసుకోవడం ముఖ్యమైనవి.
Also Read: IUI సక్సెస్ రేట్ పెంచే మార్గాలు
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility