Advanced Treatments for Male Infertility: Zero Sperm Count, అంటే అజోస్పెర్మియా (Azoospermia) ఉన్నవారిలో వీర్య ద్రవంలో స్పెర్మ్ కనిపించదు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్లాకేజ్ కారణంగా స్పెర్మ్ బయటకు రాకపోవడం (Obstructive Azoospermia), మరొకటి శరీరం స్పెర్మ్ ఉత్పత్తి చేయకపోవడం (Non-obstructive Azoospermia). ఈ సమస్య ఉన్నవారు సహజంగా గర్భం పొందడం సాధ్యపడదు. అయితే ఆధునిక వైద్యం, ప్రత్యేకమైన ఫెర్టిలిటీ టెక్నాలజీలతో ప్రెగ్నెన్సీ సాధ్యం.
ఈ పరిస్థితుల్లో స్పెర్మ్‌ను నేరుగా వృషణాల నుంచి తీసే పద్ధతులు ఉపయోగిస్తారు. అందులో ముఖ్యమైనవి రెండు -TESA (Testicular Sperm Aspiration) మరియు PESA (Percutaneous Epididymal Sperm Aspiration). వీటిలో మైక్రో సర్జరీ ద్వారా వృషణంలో నుంచి స్పెర్మ్‌ను సేకరిస్తారు. ఇది Obstructive Azoospermia ఉన్నవారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్పెర్మ్ దొరికినపుడు, దీన్ని IVF లేదా ICSI కోసం ఉపయోగిస్తారు.
అయితే స్పెర్మ్ ఉత్పత్తి సమస్యలతో బాధపడే Non-obstructive Azoospermia ఉన్నవారిలో Micro TESE అనే అధునాతన సర్జరీ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో మైక్రో స్కోప్ సహాయంతో వృషణాల్లో చిన్న భాగాల్లో నుండి స్పెర్మ్‌ను శోధించి తీసుకుంటారు. ఇది క్లిష్టమైన విధానం అయినా, మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.
ఈ టెక్నిక్‌లతో పొందిన స్పెర్మ్‌ను ICSI (Intracytoplasmic Sperm Injection) అనే IVF టెక్నిక్‌లో ఉపయోగిస్తారు. ఇందులో ఒక్కో స్పెర్మ్‌ను నేరుగా ఒక్కో ఎగ్‌లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది అత్యంత ప్రభావవంతమైన ట్రీట్మెంట్. స్పెర్మ్ తక్కువ ఉన్నా, వేరే టెక్నిక్‌లతో పద్ధతిగా ఈ విధంగా గర్భం సాధ్యపడుతుంది.
Zero Sperm Count ఉన్నవారికి ప్రెగ్నెన్సీ సాధ్యమే.. కానీ దీనికి సరైన టెస్టులు, నిపుణుల గైడెన్స్, మరియు IVF-ICSI వంటి సాంకేతిక సహాయం అవసరం. శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన ఈ విధానాల వల్ల, నేడు ఎన్నో జంటలు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.
Also Read: AI తో ప్రెగ్నెన్సీ.! IVF సక్సెస్‌ను పెంచే కొత్త దారి
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility