Best Fertility Treatment Options: సక్సెసఫుల్ ప్రెగ్నెన్సీ కోసం బెస్ట్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఏది? | Pozitiv Fertility, Hyderabad

Best Fertility Treatment Options:సంతాన లేమి సమస్యలు ఎదుర్కొంటున్న దంపతుల కోసం నేటి ఆధునిక వైద్యంలో అనేక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే "బెస్ట్ ట్రీట్మెంట్" అన్నది ప్రతి ఒక్కరి శరీర పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది. దంపతుల వయస్సు, హార్మోనల్ స్థితి, స్పెర్మ్ కౌంట్, ఫాలోపియన్ ట్యూబ్స్ హెల్త్, ఎగ్ క్వాలిటీ వంటి అంశాలను బట్టి ట్రీట్మెంట్ ఎంపిక అవుతుంది. అయినా సర్వసాధారణంగా ఉపయోగపడే ప్రధాన ట్రీట్మెంట్లు ఇవే:

1. IUI (Intrauterine Insemination): ఇది ప్రాథమిక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. శుద్ధి చేసిన స్పెర్మ్‌ను నేరుగా గర్భాశయంలోకి పంపడం ద్వారా గర్భధారణ అవకాశాన్ని పెంచుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు లేదా లైట్ PCOD ఉన్న మహిళలకు మొదటి స్టెప్‌గా ఉపయోగపడుతుంది.

2. IVF (In Vitro Fertilization): ఇది పూర్తిగా ల్యాబ్ లో చేసే పద్ధతి. ఎగ్‌ను శరీరం వెలుపల స్పెర్మ్‌తో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోలను మళ్ళీ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ట్యూబ్ బ్లాక్స్, లో క్వాలిటీ ఎగ్స్ లేదా స్పెర్మ్ సమస్యలున్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడే ట్రీట్మెంట్. విజయవంతమైన గర్భధారణకు మంచి అవకాశాలున్నాయి.

3. ICSI (Intracytoplasmic Sperm Injection): ఇది IVF లో వన్ స్టెప్ అడ్వాన్స్డ్ మెథడ్. ఒక్కో స్పెర్మ్‌ను నేరుగా ఎగ్‌లోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా ఫర్టిలైజేషన్ చేస్తారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారికి ఇది అత్యుత్తమ ఎంపిక.

Also Read:  AI తో ప్రెగ్నెన్సీ.! IVF సక్సెస్‌ను పెంచే కొత్త దారి

4. Donor Eggs or Donor Sperm: వయస్సు ఎక్కువైన మహిళలకు లేదా ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిన వారికి డోనర్ ఎగ్స్ ఉపయోగించవచ్చు. అలాగే మేల్ ఇన్ఫెర్టిలిటీ సమస్యలున్నప్పుడు డోనర్ స్పెర్మ్ కూడా ఉపయోగపడుతుంది. 

5. ఎగ్ ఫ్రీజింగ్ మరియు ఎంబ్రియో ఫ్రీజింగ్: ఇది భవిష్యత్‌ గర్భధారణ కోసమై ముఖ్యమైన ఎంపిక. వయస్సు పెరగకముందే ఆరోగ్యవంతమైన ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసి, తర్వాత అవసరమైన సమయంలో IVF ద్వారా గర్భధారణ సాధించవచ్చు.

బెస్ట్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నది ఒకే ఒక విధానంగా ఉండదు. దంపతుల శరీర పరిస్థితులను పరిశీలించి వైద్యులు ఏ ట్రీట్మెంట్ సరిగ్గా పనిచేస్తుందో నిర్ణయిస్తారు. కనుక మంచి ఫెర్టిలిటీ సెంటర్‌కి వెళ్లి పూర్తి పరీక్షల తర్వాత సరైన ట్రీట్మెంట్‌ను ఎంపిక చేసుకోవడమే ఉత్తమ మార్గం. ఏ ట్రీట్మెంట్ అయినా, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే గర్భధారణ సాధ్యమే.

Also Read: ZERO Sperm ఉన్నవారికి ప్రెగ్నెన్సీ రావాలంటే ఇది బెస్ట్ ట్రీట్మెంట్!

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post