Dealing with 1st IVF Failure: IVF ట్రీట్మెంట్ చాలా మంది దంపతులకు ఓ ఆశాకిరణం. కానీ మొదటి సారి ఫెయిలయ్యినప్పుడు బాధ, మానసిక ఒత్తిడి, భవిష్యత్తుపై అనేక సందేహాలు ఎదురవుతాయి. అయితే, ఇది ఆఖరి అవకాశం కాదు అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి. చాలా మంది మొదటి IVF ఫెయిలయిన తర్వాతే రెండో, మూడో ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతున్నారు.
1. మానసికంగా స్టేబుల్ గా ఉండాలి: మొదటి ఫెయిల్యూర్ తర్వాత బాధపడటం సహజం. అయితే ఈ బాధను ఎక్కువ కాలం మనస్సులో పెట్టుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కనుక ఫెయిల్యూర్‌ని ఒక అనుభవంగా తీసుకుని ముందుకెళ్లే ధైర్యాన్ని సొంతం చేసుకోవాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.
2. వైద్యులను సంప్రదించి కారణాలు తెలుసుకోవాలి: IVF ఫెయిల్యూర్ వెనక కారణాలు పలు ఉంటాయి. ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ సమస్య, ఎంబ్రియో అభివృద్ధి లోపం, యుటరస్ సమస్య, హార్మోనల్ అసమతుల్యతలు. డాక్టర్ పాత IVF రిపోర్ట్స్ ఆధారంగా ఈ అంశాలను విశ్లేషించి తదుపరి స్టెప్ గురించి సూచనలు ఇస్తారు.
3. రెండో ప్రయత్నానికి ముందు టెస్టులు చేయించుకోవాలి: ఎంబ్రియో స్క్రీనింగ్ (PGT), ఎండోమెట్రియల్ రెసెప్టివిటీ టెస్టింగ్ (ERA), హార్మోన్ టెస్టులు, ఇమ్యూనాలజీ రిపోర్ట్స్ వంటివి రెండో IVFకు ముందు చేసుకోవడం వల్ల సక్సెస్ ఛాన్స్ పెరుగుతుంది. పాత తప్పులను గమనించి కొత్త మార్గాలు ప్రయత్నించవచ్చు.
4. లైఫ్ స్టైల్ మార్పులు చేయాలి: ఆహారంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి. మద్యం, పొగతాగడం మానేయాలి. వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవాలి. హెల్తీ బాడీ, కూల్ మైండ్ IVF సక్సెస్‌ను ప్రభావితం చేస్తాయి.
5. పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్లాలి: ఒకసారి ఫెయిలయ్యిందని అంటే జీవితాంతం ఫెయిల్యూరే అనే భావనని తొలగించాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మల్టిపుల్ IVF ఫెయిల్యూర్ తర్వాత విజయాన్ని సాధించారు. కనుక మీకూ ఆ అవకాశమే ఉంది.
IVF ఫెయిల్యూర్ ఎమోషనల్ గా కష్టమైన అనుభవమే అయినా, దీన్ని ఓ అధ్యాయంగా తీసుకుని ముందుకు సాగాలి. సరైన వైద్య సలహా, లైఫ్ స్టైల్ మార్పులు, విశ్వాసం ఉంటే కచ్చితంగా IVF విజయవంతమవుతుంది. కాబట్టి ఆశను వదులుకోకండి.
Also Read: సక్సెసఫుల్ ప్రెగ్నెన్సీ కోసం బెస్ట్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఏది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility