Twin Babies In IVF: In Vitro Fertilization పద్ధతిలో కవలలు (Twins) లేదా ముగ్గురు (Triplets) పుట్టే అవకాశాలు సాధారణ గర్భధారణతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటాయి. సహజంగా గర్భం ధరించినప్పుడు కవలలు పుట్టే ఛాన్స్ 1 నుండి 2 శాతం మాత్రమే ఉంటుంది. కానీ IVFలో ఇది 20% నుండి 30% వరకూ ఉండవచ్చు.
IVF సమయంలో గర్భాశయంలో ఎక్కువ ఎంబ్రియోల్ని (2 లేదా 3) ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాంతో ఒకేసారి రెండు లేదా మూడు ఎంబ్రియోలు తీసుకోవచ్చు. ఇది కవలలు లేదా త్రిప్లెట్స్ పుట్టే అవకాశం పెంచుతుంది. అయితే, ఇప్పటికీ చాలా IVF సెంటర్లు అధిక గర్భధారణ ప్రమాదాలను తగ్గించేందుకు Single Embryo Transfer (SET) ని ప్రోత్సహిస్తున్నాయి.
కవల గర్భధారణ అనేది రిస్క్ ప్రెగ్నెన్సీ గా పరిగణించబడుతుంది. ఇది గర్భిణీకి ప్రీటర్మ్ లేబర్, హై బ్లడ్ ప్రెషర్, జెస్టేషనల్ డయాబెటిస్, సిజేరియన్ డెలివరీ అవసరం వంటి సమస్యలు కలిగించవచ్చు. పుట్టే బిడ్డలకు కూడా కొంతవరకు అండర్‌వెయిట్, న్యూరో డెవలప్‌మెంట్ ఇష్యూస్ రావచ్చు.
IVF ద్వారా కవలలు పుట్టే అవకాశం సహజ గర్భధారణ కంటే ఎక్కువే. అయితే, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, డాక్టర్లు ఎన్ని ఎంబ్రియోలు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నదాన్ని నిర్ణయిస్తారు. మీకు ఏది ఉత్తమమో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.
Also Read: జీరో స్పెర్మ్ కౌంట్ (Azoospermia) ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ సాధ్యమా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility
