Successful Pregnancy with Zero Sperm Count: "జీరో స్పెర్మ్ కౌంట్" అంటే ఓ పురుషుడి వీర్య ద్రవంలో స్పెర్మ్స్ లేకపోవడం. దీన్ని వైద్య భాషలో "Azoospermia" అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. Obstructive Azoospermia (మార్గాల్లో అడ్డంకులు వలన స్పెర్మ్ బయటకు రాకపోవడం), Non-obstructive Azoospermia (శరీరంలోనే స్పెర్మ్ ఉత్పత్తి తక్కువగా లేదా అసలే జరగకపోవడం). అయితే, ప్రస్తుత వైద్య సాంకేతికత వల్ల కూడా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారికి కూడా సంతానం పొందే అవకాశం ఉంది.
1. మొదట స్పెర్మ్ ఉన్నదో లేదో నిర్ధారించాలి: ఒకసారి స్పెర్మ్ కౌంట్ జీరో అని తేలితే, అప్పుడు సాధారణంగా కొన్ని రిపీట్ టెస్టులు, హార్మోన్ టెస్టులు, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, జెనిటిక్ టెస్టులు చేస్తారు. అప్పుడు సమస్య ఏ విధమైనదో స్పష్టమవుతుంది.. అడ్డంకులు ఉన్నాయా? లేక ఉత్పత్తి సమస్యేనా? అని ఆ టెస్టుల్లో తేలుతుంది.
2. శస్త్రచికిత్స ద్వారా స్పెర్మ్ సేకరణ: Obstructive Azoospermia ఉన్నవారిలో టెస్టికల్స్ లో స్పెర్మ్ ఉత్పత్తి జరుగుతున్నా స్పెర్మ్స్ బయటకు రావడం జరగదు. ఇలాంటి సందర్భాల్లో TESA (Testicular Sperm Aspiration), PESA (Percutaneous Epididymal Sperm Aspiration) వంటి శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా టెస్టిస్ లోంచి నేరుగా స్పెర్మ్ తీసి IVF లేదా ICSI ద్వారా గర్భధారణ సాధించవచ్చు.
3. డోనర్ స్పెర్మ్ ఉపయోగం: అయితే స్పెర్మ్ ఉత్పత్తే పూర్తిగా లేకపోతే, డోనర్ స్పెర్మ్ ద్వారా IUI లేదా IVF చేయడం వలన గర్భం పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలా కుటుంబాలకు ఒక ప్రత్యామ్నాయం.
4. మానసికంగా సిద్ధంగా ఉండాలి: జీరో స్పెర్మ్ కౌంట్ విన్న వెంటనే చాలా మంది షాక్ అవుతారు. కానీ ప్రస్తుతం వైద్య రంగం బాగా అభివృద్ధి చెందింది. సైన్స్ లో ఆశ ఉందని, ఎన్నో జంటలు ఈ చికిత్సలతో తల్లిదండ్రులు అవుతున్నారని గుర్తుంచుకోవాలి.
జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నా కూడా తల్లిదండ్రులవ్వడం కేవలం కల మాత్రమే కాదు.. అది వైద్యపరంగా సాధ్యమే. సరైన డయాగ్నోసిస్, మంచి యూరాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్టు ద్వారా సలహా తీసుకోవడం ముఖ్యమైనది. ఇప్పటికే ఎన్నో జంటలు IVF, ICSI, TESA లాంటి పద్ధతుల ద్వారా తమ కలను నిజం చేసుకున్నారు. మీరు కూడా చేయవచ్చు.
Also Read: IVF బేబీ కి, నేచురల్ బేబీ కి మధ్య తేడా ఏంటి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility
