IVF Baby vs Normal Baby: ఒకసారి గర్భధారణ జరిగాక అది సహజంగా జరిగిందా, లేక IVF ద్వారా జరిగిందా అన్న తేడా శారీరకంగా పిల్లలపై ఉండదు. ఎందుకంటే రెండు పద్ధతులలోనూ ఒకే విధంగా స్త్రీ అండం (egg) మరియు పురుష స్పెర్మ్ (sperm) కలసి ఎంబ్రియోగా ఏర్పడి, గర్భాశయంలో అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు పద్ధతుల మధ్య తేడా గర్భధారణ జరిగే విధానంలో మాత్రమే ఉంటుంది.
1. నేచురల్ గా గర్భధారణ అంటే, అండాశయం విడుదల చేసిన అండం ఫాలోపియన్ ట్యూబ్ లో స్పెర్మ్‌తో కలసి ఫలదీకరణ జరగడం. IVF లో అయితే, ఈ ఫలదీకరణ ప్రక్రియ బయట ల్యాబ్ లో చేస్తారు. అండాన్ని తీసి స్పెర్మ్‌తో కలిపి ఎంబ్రియోని సృష్టించి, గర్భాశయంలోనికి ప్రవేశపెడతారు.
2. IVF బేబీ మరియు నేచురల్ బేబీ ఆరోగ్య పరంగా ఒకేలా ఉంటారు. IVF ద్వారా పుట్టిన పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. IVF పద్ధతిలో డాక్టర్లు మంచి అండాలు, మంచి స్పెర్మ్‌ను ఎంపిక చేసి ఎంబ్రియో సృష్టిస్తారు కనుక కొన్నిసార్లు జన్యులోపాల అవకాశాలు తగ్గుతాయన్న నమ్మకం కూడా ఉంది.
3. చాలా IVF గర్భధారణలు ప్రత్యేకంగా పర్యవేక్షించబడతాయి. వయసు ఎక్కువ, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్నవారికి IVF సూచిస్తారు కాబట్టి సిజేరియన్ డెలివరీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
4. కొన్ని కుటుంబాలు IVF బేబీ అంటే ఏమైనా తేడా ఉంటుందేమో అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ. IVF పిల్లల ఎదుగుదలలో ఎలాంటి తేడా ఉండదు. దేహపరంగా, మేధస్సు పరంగా కూడా ఇద్దరి మధ్య తేడా ఉండదు.
Also Read: పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నా ప్రెగ్నెన్సీ రావడం లేదా? అయితే ఇలా చెయ్యండి..
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility
