Anovulation: పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండటం ఆరోగ్యకరమైన ఫెర్టిలిటీకి ముఖ్య సూచనగా కనిపించినా… అది గర్భధారణకు పూర్తి హామీ ఇవ్వదని గమనించాలి. చాలా మంది మహిళలు పీరియడ్స్ టైం కి వస్తున్నాయంటే ఫెర్టైల్‌గానే అనుకుంటారు. కానీ కొన్ని సమస్యల వల్ల, పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నప్పటికీ గర్భం రాకపోవచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
ఉదాహరణకు అనోయులేషన్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకవడం వంటివి ఉండవచ్చు. పీరియడ్స్ టైం కి వచ్చినా, అండం సరిగ్గా ఫెర్టిలైజ్ కాకపోవడం, లేదా స్పెర్మ్‌తో కలవలేక పోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో చేయాల్సినవి:
1. ఒవ్యూలేషన్ ట్రాకింగ్ - అండాల విడుదల ఎప్పుడు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఓవ్యూలేషన్ స్ట్రిప్స్ వాడండి. లేదా బాడీ టెంపరేచర్, సర్వికల్ మ్యూకస్ వంటివి గమనించండి.
2. ఫెర్టిలిటీ టెస్టులు చేయించుకోండి - హార్మోన్‌లు, ఎగ్ కౌంట్, ఎగ్ నాణ్యత, ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్‌గా ఉన్నాయా అనే దానిపై టెస్టులు చేయించుకోవాలి.
3. పార్ట్నర్ స్పెర్మ్ టెస్టు కూడా తప్పనిసరిగా చేయించాలి. ఎందుకంటే సమస్య కేవలం మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఉండవచ్చు.
4. జీవనశైలి మార్పులు - మితమైన వ్యాయామం, పౌష్టికాహారం, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయాలి.
5. తరచూ ట్రై చేయడం కాదు, సరైన సమయానికి ట్రై చేయడం ముఖ్యం. ఫెర్టిలిటీ విండో అంటే అండం విడుదలయ్యే సమయం. ఆ సమయంలో సహజమైన ఇంటర్‌కోర్స్ ద్వారా గర్భధారణకు అవకాశాలు పెరుగుతాయి.
6. డాక్టర్ సలహా తీసుకోవాలి – ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదించి, అవసరమైతే IUI లేదా IVF లాంటి చికిత్సల వైపు కూడా ఆలోచించవచ్చు.
పీరియడ్స్ వస్తున్నాయని ఆరోగ్యం బాగుందనే అభిప్రాయంతో ఉండకండి. గర్భం రాకపోతే, అర్ధం చేసుకుని సరైన వైద్య సలహాతో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, మంచి ఫలితాలు సాధించవచ్చు.
Also Read: స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఆహారం మరియు లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పులు అవసరం?