Success Rate of IUI Treatment: IUI (Intrauterine Insemination) ట్రీట్మెంట్ ద్వారా గర్భధారణ సాధ్యమవుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. సాధారణంగా IUI ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ అనేది పేషెంట్ వయస్సు, underlying cause of infertility, హార్మోన్ల స్థితి, గర్భకోశ ఆరోగ్యం, స్పెర్మ్ క్వాలిటీ వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా, ఒక IUI సైకిల్ ద్వారా గర్భం రావడానికి 10% నుండి 20% వరకు అవకాశం ఉంటుంది. అంటే, 100 మందిలో 10 నుండి 20 మందికి ఈ ట్రీట్మెంట్ ద్వారా గర్భధారణ కలగవచ్చు. అయితే, ఈ శాతం 30 సంవత్సరాలకు లోబడినవారిలో ఎక్కువగా ఉండొచ్చు, కానీ వయస్సు పెరిగిన కొద్దీ రేటు తగ్గుతుంది. 35 ఏళ్ల తర్వాత IUI సక్సెస్ ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, IUI ఒక్కసారి చేసి ఫలితం రాకపోతే వెంటనే నిరాశపడొద్దు. 3 నుండి 4 సైకిళ్లు వరుసగా చేసేటప్పుడు సక్సెస్ ఛాన్స్ మరింత పెరుగుతుంది. అందువల్ల డాక్టర్ గైడెన్స్ లో, సరైన దశలతో IUI చేయించుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే, స్పెర్మ్ కౌంట్ మరియు మోటిలిటీ (చలనం) బాగుండాలి. IUI అనేది మొదటి దశలో ప్రయత్నించే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. మగవారి స్వల్ప సమస్యలు లేదా అన్ ఎక్స్‌ప్లెయిన్‌డ్ ఇన్‌ఫెర్టిలిటీ ఉన్న జంటలకు ఉపయోగపడుతుంది.
IUI తక్కువ ఖర్చుతో మంచి ఆప్షన్ అయినప్పటికీ, పేషెంట్ ప్రొఫైల్‌ను బట్టి సక్సెస్ రేట్ మారుతుంది.
Also Read: ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ తగ్గడానికి కారణాలివే!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility