Fertility Rate vs Population in India: ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ (fertility rate) గత కొన్ని దశాబ్దాల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవే ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీవనశైలి మార్పులు: నేటి యువత ఎక్కువగా శారీరక శ్రమ చేయని ఉద్యోగాల్లో ఉంటారు. ఒత్తిడి, నిద్రలేమి, సమయానికి తినకపోవడం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, ధూమపానం, మద్యం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు ఫెర్టిలిటీ తగ్గడానికి ముఖ్య కారణాలు.
2. పెళ్లి వయస్సు పెరగడం: ఇప్పటి తరం చాలా వరకు చదువులు, కెరీర్, స్థిరపడే లక్ష్యాలతో పెళ్లిని ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇది egg మరియు sperm క్వాలిటీ తగ్గడానికి దారితీస్తోంది. వయస్సు పెరిగే కొద్దీ గర్భధారణ అవకాశాలు తక్కువవుతాయి.
3. ఆరోగ్య సమస్యలు: PCOS, థైరాయిడ్, obesity, endometriosis, diabetes వంటి సమస్యలు మహిళలలో గర్భధారణపై ప్రభావం చూపుతుంటే… మగవారిలో స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ తగ్గుతుంటాయి. వీటన్నీ కలిపి infertility కు దారి తీస్తున్నాయి.
4. ఫ్యామిలీ ప్లానింగ్ అవగాహన: పిల్లల నియంత్రణ కోసం contraceptives వినియోగం పెరిగింది. చాలా జంటలు ఒకటి లేదా ఇద్దరితోనే పరిమితం కావాలని నిర్ణయించుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ రేటు తగ్గడానికి సహకరిస్తోంది.
5. ఆధునిక జీవన శైలి, వాతావరణ ప్రభావం: వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, రేడియేషన్, హార్మోన్ డిస్టర్బింగ్ కెమికల్స్ వాడకం వలన రీప్రొడక్టివ్ హెల్త్ ప్రభావితమవుతోంది. ఇది పురుషుల, స్త్రీల ఫెర్టిలిటీని గణనీయంగా తగ్గిస్తోంది.
ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అనేది జీవనశైలి, ఆరోగ్యం, ఆర్థిక సామర్థ్యం, అవగాహన లోపం ఫలితమే. దీన్ని సమర్థవంతంగా నివారించాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం, సరైన సమయానికి వైద్య సలహా తీసుకోవడం అవసరం.
Also Read: స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ క్వాలిటీ ఎందుకు తగ్గుతుందో తెలుసా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility