Low Sperm Count: ప్రస్తుతం చాలా మంది పురుషులు ఫెర్టిలిటీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం, లేదా స్పెర్మ్ క్వాలిటీ బాగోలేకపోవడం వలన గర్భధారణ కష్టంగా మారుతుంది. ఈ సమస్యలు వయస్సు పెరుగుదలతో పాటు అనేక బయటి external factors వల్ల కూడా ఏర్పడుతుంటాయి.
![]() |
| Low sperm count - Symptoms and causes |
ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు, మినరల్స్ లోపం, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి స్పెర్మ్ క్వాలిటీ పడిపోతుంది. జింక్, విటమిన్ C, సెలెనియం వంటి పోషకాలు తక్కువగా లభిస్తే స్పెర్మ్ ఉత్పత్తి క్షీణిస్తుంది. అలాగే అధిక బరువు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.
Also Read: ప్రెగ్నెన్సీ రావాలంటే ఇంటర్ కోర్స్ (Intercourse) లో ఎన్ని సార్లు పాల్గొనాలి?
![]() |
| Sperm |
అంతేకాదు, కొన్ని మెడికల్ పరిస్థితులు కూడా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు వేరికోసెల్ (వృషణాలలో నరాలు ఉబ్బిపోవడం), సెక్స్ హార్మోన్‌ల లోపం, డయాబెటిస్, థైరాయిడ్ సంబంధిత సమస్యలు, కొన్ని మందులు లేదా కీమోథెరపీ వంటివి స్పెర్మ్ తయారీకి అడ్డుకట్ట వేస్తాయి. అందుకే, ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే సమయానికి డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

