Pregnancy After Abortion: అబార్షన్ అనేది ప్రతి మహిళా జీవితంలో ఒక సున్నితమైన దశ. కానీ గతంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు గర్భస్రావం (అబార్షన్) జరిగితే, అది భవిష్యత్‌లో గర్భధారణపై ప్రభావం చూపుతుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సాధారణంగా, ఒకసారి లేదా రెండు సార్లు అబార్షన్ జరిగినట్టు ఉంటే, అది భవిష్యత్ గర్భం పై పెద్దగా ప్రభావం చూపదు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఇది ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే అవకాశం ఉంటుంది.
![]() |
Pregnancy After Abortion |
అలానే, సేఫ్ గా కాకుండా, అనుభవం లేని వైద్యుల చేత కూడా అబార్షన్లు చేయించుకున్నప్పుడు పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు, ట్యూబ్స్ బ్లాక్ అవడం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల గత అబార్షన్ చరిత్ర ఉన్నవారు తగిన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకొని, ఫెర్టిలిటీ పరిస్థితిని అంచనా వేసుకోవడం ఎంతో అవసరం.
మానసికపరంగా కూడా అబార్షన్ ఒక మహిళపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మళ్లీ గర్భం ధరించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు, శరీరానికి కూడా సమయాన్ని ఇవ్వాలి. వైద్యుల సూచనలను అనుసరించడం, అవసరమైన ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవడం ద్వారా ఆరోగ్యంగా గర్భాన్ని ధరించే అవకాశాలను పెంచుకోవచ్చు.
Also Read: పర్యావరణంలో ఉన్న టాక్సిన్లు ఫెర్టిలిటీని ఎలా ప్రభావితం చేస్తాయి?