Female Infertility Causes: మహిళల్లో గర్భకోశం (Uterus) సంబంధిత సమస్యలు Infertility కారణమవుతాయా?

Female Infertility Causes: మహిళల్లో గర్భకోశం (Uterus) సంబంధిత సమస్యలు చాలా సందర్భాల్లో Infertility కి ప్రధాన కారణంగా మారతాయి. గర్భం ఏర్పడేందుకు గర్భకోశం ఆరోగ్యంగా ఉండాలి. గర్భాశయం అనేది ఫలదీకరణమైన ఎగ్ పెరిగే ప్రదేశం. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా గర్భం ఏర్పడడం ఇబ్బంది అవుతుంది.

Female Infertility Causes
Female Infertility Causes

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ (Fibroids), పాలిప్స్ (Polyps), లేదా సెప్టం వంటి అసాధారణ నిర్మాణాలు ఉండటం వల్ల ఎంబ్రియో ఇంప్లాంటేషన్ జరగదు. అలాగే, ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయం లోపలి పొర నష్టపోయి, ఎగ్ తగిన రీతిలో అభివృద్ధి చెందకపోవచ్చు.


ఇంకొన్ని సందర్భాల్లో Congenital uterine anomalies కూడా Infertilityకి దారితీయవచ్చు. ఉదాహరణకు, Bicornuate uterus, Septate uterus లాంటి పరిస్థితులు గర్భం రాకపోవడానికి లేదా గర్భస్రావాలకు కారణమవుతాయి.

కొన్నిసార్లు మల్టిపుల్ అబార్షన్లు, సిజేరియన్ డెలివరీలు లేదా ఇతర శస్త్రచికిత్సల తర్వాత గర్భాశయంలో ఏర్పడే Asherman's Syndrome కూడా సమస్యలు కలిగించవచ్చు. ఈ పరిస్థితుల్లో గర్భాశయపు లోపల అభివృద్ధి అవలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ తరహా uterine సమస్యలను గుర్తించేందుకు ట్రాన్స్‌వాజినల్ అల్ట్రాసౌండ్, హిస్టెరోసల్పింగోగ్రఫీ (HSG), హిస్టరొస్కోపి వంటి పరీక్షలు చేస్తారు. సమస్య తీరును బట్టి, మందులు లేదా శస్త్రచికిత్సల ద్వారా చికిత్స అందించవచ్చు. కాబట్టి, గర్భం రాకపోతే గైనకాలజిస్ట్ సలహాతో గర్భకోశాన్ని (Uterus) పరిశీలించడం చాలా ముఖ్యం.


మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility
Post a Comment (0)
Previous Post Next Post