IUI vs IVF పెగ్నెన్సీ ఛాన్స్ దేనిలో ఎక్కువ? | Pozitiv Fertility, Hyderabad

IUI (Intrauterine Insemination) మరియు IVF (In-vitro Fertilization) రెండూ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్. కానీ గర్భధారణ అవ్వడానికి వీటిలో వచ్చే ఛాన్సులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి.


1. IUI అంటే ఏమిటి?

  • IUI అనేది సాధారణంగా "సులభమైన ఫెర్టిలిటీ ట్రీట్మెంట్" అని చెప్పవచ్చు.
  • ఈ విధానంలో, పురుషుడి స్పెర్మ్‌ని శుద్ధి చేసి నేరుగా మహిళా గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు.
  • ఇక్కడ ఫర్టిలైజేషన్ (egg + sperm కలయిక) సహజంగా మహిళ శరీరంలోనే జరుగుతుంది.
  • సాధారణంగా మొదటి స్టెప్ ట్రీట్మెంట్‌గా డాక్టర్లు IUI‌ని సూచిస్తారు.

2. IVF అంటే ఏమిటి?

  • IVF అంటే “టెస్ట్ ట్యూబ్ బేబీ” పద్ధతి.
  • ఇందులో మహిళ నుంచి ఎగ్స్ తీసి, పురుషుడి స్పెర్మ్‌తో లాబ్‌లో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని రూపొందిస్తారు.
  • తర్వాత ఆ ఎంబ్రియోని గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
  • IVF కాస్త కాంప్లెక్స్ ప్రాసెస్ అయినా, అధిక విజయావకాశాలు కలిగిన ట్రీట్మెంట్.

3. విజయావకాశాలు (Success Rates)

IUI Success Rate:

  • సాధారణంగా 10% - 20% వరకు ఉంటుంది (ఒక సైకిల్‌లో).
  • వయస్సు 35 లోపు ఉన్న మహిళల్లో, స్పెర్మ్ కౌంట్ నార్మల్‌గా ఉన్నప్పుడు ఈ అవకాశాలు పెరుగుతాయి.

IVF Success Rate:

  • IVF‌లో 40% – 60% వరకు విజయావకాశాలు ఉంటాయి (ఒక సైకిల్‌లో).
  • వయస్సు, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ హెల్త్, లైఫ్‌స్టైల్ ఆధారంగా రేట్ మారుతుంది.

4. ఎవరికి IUI, ఎవరికి IVF?

IUI సూట్ అయ్యే వారు:

  • స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, శుద్ధి తర్వాత వాడుకోవచ్చునప్పుడు
  • PCOS (Polycystic Ovary Syndrome) ఉన్నప్పుడు
  • Ovulation సమస్యలు ఉన్నప్పుడు
  • Unexplained infertility ఉన్నప్పుడు

IVF సూట్ అయ్యే వారు:

  • IUIలో 3-4 ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయినప్పుడు
  • స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు
  • Fallopian tubes బ్లాక్ అయ్యినప్పుడు
  • వయస్సు 35 ఏళ్లకు పైబడినప్పుడు
  • Genetic issues ఉన్నప్పుడు

5. IUI vs IVF: ఏది మంచిది?

  • IUI ఖర్చు తక్కువ, ప్రాసెస్ సులభం కానీ విజయావకాశాలు తక్కువ.
  • IVF కాస్త ఖరీదైనదే అయినా విజయావకాశాలు ఎక్కువ.
  • చాలా మంది జంటలు మొదట IUI ప్రయత్నించి, ఫలితం రాకపోతే IVF వైపు వెళ్తారు.

"IUI vs IVF పెగ్నెన్సీ ఛాన్స్ దేనిలో ఎక్కువ?" అని అడిగితే - IVFలో విజయావకాశాలు ఎక్కువ అని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ, ప్రతి జంట పరిస్థితి వేరేలా ఉంటుంది. అందుకే మీ ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఫెర్టిలిటీ హిస్టరీని బట్టి డాక్టర్ సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది.

Also Read: కుక్కలని పెంచుకుంటున్నారా?

Post a Comment (0)
Previous Post Next Post