Sperm Count: స్పెర్మ్ కౌంట్ అంటే ప్రతి మిల్లీమీటర్ వీర్యంలో ఉండే స్పెర్మ్ కణాల సంఖ్య. ఒక వ్యక్తికి ఉండాల్సిన స్పెర్మ్స్ కౌంట్ ఎంత ఉండాలంటే తక్కువలో తక్కువ 15 మిలియన్ స్పెర్మ్స్ ఉన్నా సరిపోతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య ప్రమాదకరంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవనశైలిలో తేడాలు స్పెర్మ్ కౌంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మితిమీరిన మద్యపానం, సిగరెట్ లేదా గుట్కా వంటి పొగతాగుడు పదార్థాల వినియోగం, మాదకద్రవ్యాల ఉపయోగం స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి.
![]() |
Sperm Count |
అలాగే, శరీరానికి అధిక ఉష్ణోగ్రత కూడా స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఉదాహరణకి.. ల్యాప్‌టాప్‌ను మోకాళ్ళ పైన ఎక్కువసేపు ఉంచటం, టైటుగా ఉండే అండర్‌వేర్‌లు ధరించడం, లేదా బాగా వేడి బాత్‌లు తీసుకోవడం వంటివి స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి.
Also Read: సెకండ్ ఇన్ఫెర్టిలిటీ కి కారణాలు ఏంటి?
తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు హార్మోన్ల అసమతుల్యతను కలిగించి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించవచ్చు. కొన్నిసార్లు వేరికోసెల్ (వృషణం చుట్టూ రక్తనాళాల వాపు), థైరాయిడ్ గ్లాండ్ అసమతుల్యత, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ప్రధానంగా ఇబ్బంది కలిగిస్తాయి.
కనుక స్పెర్మ్ కౌంట్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. సరిగ్గా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడం మరియు రొటీన్‌గా ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. ఇదిలా ఉంచితే, సమస్య కొనసాగుతుంటే స్పెర్మ్ అనాలసిస్ చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility