Inherited Infertility Problems: ఇన్‌ఫెర్టిలిటీ సమస్య జెనెటిక్స్ ద్వారా వస్తుందా?

Inherited Infertility Problems: కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెర్టిలిటీ (Infertility) సమస్య జెనెటిక్ (Genetic) కారణాల వల్ల రావచ్చు. ఈ పరిస్థితిని జెనెటికల్ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ముఖ్యంగా పురుషులు మరియు మహిళలు రెండింటిలోనూ ఈ ప్రభావం కనిపించొచ్చు.


పురుషులలో జెనెటిక్ ఇన్‌ఫెర్టిలిటీ:

  • Y క్రోమోసోమ్ లో లోపాలు - కొన్ని పురుషుల్లో Y క్రోమోసోమ్‌లోని ప్రత్యేకమైన జీన్లు లేనివల్ల స్పెర్మ్ ఉత్పత్తి జరగదు.
  • క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్ (Klinefelter Syndrome) - ఒకే వ్యక్తిలో XXY అనే అదనపు క్రోమోసోమ్ ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గిపోతుంది.
  • తీవ్రమైన ఒలిగోజోస్పెర్మియా / అజోస్పెర్మియా - చాలా తక్కువ స్పెర్మ్ లేదా అసలు లేకపోవడం కూడా జెనెటికల్ డిఫెక్ట్స్ వల్లే జరుగుతుంది.

మహిళల్లో జెనెటిక్ ఇన్‌ఫెర్టిలిటీ:

  • టర్నర్ సిండ్రోమ్ (Turner Syndrome) - ఒక X క్రోమోసోమ్ మాత్రమే ఉండే స్థితి. దీనివల్ల ఓవరీస్ సరిగ్గా అభివృద్ధి చెందవు.
  • Premature Ovarian Failure (POF) - 40 ఏళ్లలోపే అండాల ఉత్పత్తి ఆగిపోవడం కూడా జెనెటికల్ కారణాలతో ఏర్పడవచ్చు.
  • ఇండివిడ్యూల్ జీన్స్ లో మ్యూటేషన్లు - ఉదాహరణకి FMR1 జీన్ మ్యూటేషన్ వల్ల అండాల నాణ్యత లేదా సంఖ్య తగ్గిపోతుంది.


ఇంకా కొన్ని కీలక అంశాలు:

  • కొన్నిసార్లు క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల గర్భం రావడంలో సమస్యలు వస్తాయి, గర్భం వచ్చినా అబార్షన్ అయ్యే అవకాశముంది.
  • ఇలాంటి జెనెటిక్ ఇన్ఫెర్టిలిటీ అనుమానం ఉన్నప్పుడు జెనెటిక్ కౌన్సిలింగ్ మరియు కార్యోటైపింగ్ టెస్టులు చేయడం అవసరం.

సాధ్యమైన పరిష్కారాలు:

  • జెనెటికల్ ఇన్‌ఫెర్టిలిటీ ఉన్నవారికి IVF, ICSI, లేదా డోనర్ ఎగ్స్/స్పెర్మ్ ఉపయోగించి గర్భధారణ సాధ్యమే.
  • సరైన డయాగ్నోసిస్, ఫెర్టిలిటీ స్పెషలిస్టుల మార్గనిర్దేశంతో మంచి ఫలితాలు సాధ్యమవుతాయి.

వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో.. జెనెటిక్ కారణాలతో ఇన్‌ఫెర్టిలిటీ వచ్చినా, సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే తల్లిదండ్రుల కావడం సాధ్యమే.

Also Read:  హుక్కా, ఈ సిగరెట్ల వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయా?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post