Sex During IVF Cycle: IVF చికిత్స సమయంలో భార్యభర్తలు శారీరక సంబంధం పెట్టుకోవచ్చా లేదా అనేది చికిత్స దశపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా డాక్టర్లు ఎగ్స్ ను పెంచే దశలో, అంటే హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకునే సమయంలో ఎక్కువగా సంబంధం పెట్టుకోవడం నివారించమని సూచిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో గర్భాశయం మరియు అండాశయాలు ఎక్కువగా ఉబ్బిపోతాయి, దాంతో అసౌకర్యం, నొప్పి లేదా అరుదుగా అండాశయ మలుపు (Ovarian Torsion) వచ్చే అవకాశం ఉంటుంది.
ఎగ్ రిట్రీవల్ (ఎగ్స్ సేకరణ) తరువాత కొన్ని రోజులు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ సమయంలో సంబంధం పెట్టుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదా అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ జరిగిన తరువాత కూడా కనీసం 5–7 రోజులు సంబంధం పెట్టుకోవద్దని ఎక్కువగా వైద్యులు సూచిస్తారు, ఎందుకంటే ఆ సమయంలో ఎంబ్రియో గర్భాశయంలో సరిగ్గా స్థిరపడటానికి సమయం కావాలి.
అయితే, IVF ప్రక్రియలోని మిగతా దశల్లో, ఎలాంటి వైద్య సమస్యలు లేకపోతే, డాక్టర్ అనుమతి ఉంటే తేలికపాటి సంబంధం పెట్టుకోవచ్చు. అయినా కూడా, ప్రతి జంట పరిస్థితి వేరుగా ఉండటం వల్ల, ఏ దశలో అనుమతి ఉందో డాక్టర్ గైడ్‌లైన్ ప్రకారం మాత్రమే పాటించడం మంచిది.
IVF టైంలో సంబంధం పెట్టుకోవచ్చా లేదా అనేది దశలవారీగా వైద్యుడి సలహా తీసుకుని నిర్ణయించాలి. ఇది చికిత్స విజయాన్ని ప్రభావితం చేయకుండా ఉండటానికి కీలకమైన అంశం.
Also Read: ఒక్క శుక్ర కణానినికి ఎంత పవర్ ఉందో తెలుసా?