Single Sperm Cell Facts: ఒక్క శుక్ర కణానినికి ఎంత పవర్ ఉందో తెలుసా?

Single Sperm Cell Facts: ఇప్పుడున్న వారిలో చాలా మంది ఏదో ఒక రూపంలో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ఒక MB ఫైల్ డౌన్‌లోడ్ కావాలంటే ఎంతో సమయం పట్టేది. కానీ ఇప్పుడు 1 GB ఫైల్ కూడా క్షణాల్లో డౌన్‌లోడ్ అవుతోంది. ఈ 1 జీబీ డేటాలో అనేక రకాల సమాచారం ఉండొచ్చు. ఉదాహరణకు, ఈ పరిమాణంలో ఒక సినిమా కూడా చూడవచ్చు. మరి 38 జీబీలో ఎంత సమాచారం ఉంటుంది? దాదాపు 38 సినిమాలు చూడగలిగేంత. ఈ 38 జీబీ గురించి ఎందుకు చర్చ వస్తోందంటే.. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, ఒక్క శుక్రకణంలోనే 38 జీబీ డేటా ఉంటుంది. ఒక శుక్రకణంలోనే ఇంత డేటా ఉంటే, కోట్ల శుక్రకణాల్లో ఎంత జీబీ సమాచారం ఉండొచ్చు? ఆ డేటా ఉపయోగం ఏమిటి? అనేది ఆసక్తికరమైన ప్రశ్న.

Single Sperm 

ఇటీవల శాస్త్రవేత్తలు శుక్రకణాలు ఏ విధంగా సమాచారాన్ని చేరవేస్తాయి? అందులో ఎంత పరిమాణంలో డేటా ఉంటుంది? అనే అంశంపై అధ్యయనం చేశారు. వారి నివేదిక ప్రకారం, శరీరంలోని అన్ని అవయవాలకు అవసరమైన సమాచారాన్ని చేరవేయడంలో శుక్రకణాలు కీలక పాత్ర పోషిస్తాయి. మనం రోజూ ఉపయోగించే ఇంటర్నెట్‌లో 1 జీబీ డేటా ఎంత సమాచారం ఇస్తుందో, దానికి రెట్టింపు స్థాయిలో శుక్రకణాలు సమాచారాన్ని సేకరిస్తాయి.


Group of Sperm Cells

ఒక శుక్రకణంలో సుమారు 38 జీబీ వరకు డేటా ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇందులో సుమారు 750 MB డేటా శరీరంలోని కళ్ళు, జుట్టు రంగు, ఎత్తు వంటి భౌతిక లక్షణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. మిగతా డేటా DNA ఎలా పనిచేయాలో సూచిస్తుంది. ఒక్క శుక్రకణంలో 38 జీబీ ఉంటే, కొన్ని కోట్ల శుక్రకణాల్లో ఎంత సమాచారం ఉంటుందో లెక్కించగా, ఒకసారి స్థలనం జరిగినప్పుడు విడుదలయ్యే 20 నుంచి 50 కోట్ల శుక్రకణాల్లో సుమారు 19,000 టెరాబైట్‌ల వరకు డేటా ఉంటుందని తేలింది.

Single Sperm Cell Facts 

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పరిమాణంలోని సమాచారం సరిపోతుంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఈ పరిమాణం కంటే తక్కువ డేటా ఉన్నప్పటికీ కంప్యూటర్ పనిచేస్తుంది. ఈ స్థాయిలో, లేదా అంతకంటే ఎక్కువగా, మానవ శరీర నిర్మాణానికి అవసరమైన అన్ని సమాచారాన్ని శుక్రకణాలు కలిగి ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి శుక్రకణాలు మారడం ద్వారా ఎంతో విలువైన డేటా బదిలీ అవుతుంది. ఫలితంగా, ఒక వ్యక్తిలోని లక్షణాలు మరొక వ్యక్తికి చేరుతాయి. ఈ విధంగా ఇద్దరి కలయికతో కొత్త వ్యక్తికి కొత్త లక్షణాలు ఏర్పడతాయి.

Post a Comment (0)
Previous Post Next Post