Low Sperm Count: సాధారణంగా స్పెర్మ్ కౌంట్ శారీరక ఆరోగ్యాన్ని, హార్మోన్ల సమతౌల్యాన్ని, జీవనశైలిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో స్పెర్మ్ కౌంట్ అకస్మాత్తుగా (సడెన్‌గా) తగ్గిపోవచ్చు.
దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి:
- తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress): అధిక మానసిక ఒత్తిడిలో ఉండటం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతిని స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.
- అధిక వేడి పరిసరాలు: అతిగా వేడి వాతావరణం లేదా హాట్ వాటర్ బాత్‌లు, ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ మోకాళ్ళ మీద పెట్టుకోవడం వంటివి స్పెర్మ్ కౌంట్‌ను తక్షణమే తగ్గించవచ్చు.
- అల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్: ఈ వ్యసనాల వాడకం వల్ల టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా స్పెర్మ్ ఉత్పత్తి తక్షణంగా తగ్గుతుంది.
- హార్మోనల్ డిజార్డర్లు: అందులో ముఖ్యంగా టెస్టోస్టెరోన్ లెవల్స్ తగ్గిపోవడం, థైరాయిడ్ సమస్యలు, ప్రోలాక్టిన్ అధికంగా ఉండటం వంటి మార్పులు స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి.
- వైరల్ లేదా ఫీవర్ ఇన్ఫెక్షన్లు: డెంగ్యూ, కోవిడ్ వంటి వైరల్ ఫీవర్‌ల తర్వాత కొంత కాలానికి స్పెర్మ్ కౌంట్ లోడౌన్ అవుతుంది. ఇది తాత్కాలికంగా ఉంటే కొంతకాలంలో తిరిగి నార్మల్ అవుతుంది.
- కెమికల్ ఎక్స్‌పోజర్, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్: హార్ష్ కెమికల్స్, పెస్టిసైడ్స్, కొన్ని యాంటీబయోటిక్స్ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్లు స్పెర్మ్ కౌంట్‌ను సడెన్‌గా తగ్గించే ప్రమాదం ఉంటుంది.
స్పెర్మ్ కౌంట్ అకస్మాత్తుగా తగ్గినట్లు అనిపిస్తే, డాక్టర్‌ని సంప్రదించి కారణాన్ని గమనించడం, అవసరమైన టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం.
Also Read: వైద్య రంగంలో మరో అద్భుతం.. 30 ఏళ్ల నాటి పిండం నుంచి జన్మించిన శిశువు!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility