World's oldest baby: వైద్య రంగంలో మరో అద్భుతం.. 30 ఏళ్ల నాటి పిండం నుంచి జన్మించిన శిశువు!

World's Oldest Baby: వైద్య రంగంలో ఓ అద్భుతం చరిత్ర సృష్టించింది. నూతన జీవ సాంకేతికత మరోసారి తన శక్తిని చాటింది. ఏకంగా 30 ఏళ్ల క్రితం ప్రయోగశాలలో రూపొందించి, ఘనీభవించిన స్థితిలో శీతలీకరించి భద్రపరచిన ఓ పిండం ఇప్పుడు ఓ ఆరోగ్యవంతమైన శిశువుగా జన్మించడమే ఇందుకు సాక్ష్యం. ఈ అరుదైన సంఘటన అమెరికాలోని ఓహియోలో చోటుచేసుకుని, పునరుత్పత్తి వైద్య చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఓ దంపతుల కలకు ఇది వరంగా మారింది.

లిండ్సే మరియు టిమ్ పియర్స్ అనే దంపతులు చాలాకాలంగా పిల్లల కోసం కృషి చేస్తున్నారు. చివరికి, ‘స్నోఫ్లేక్స్’ అనే పిండ దత్తత కార్యక్రమం ద్వారా వారి ఆశ నిజమైంది. ఈ కథలో మరో కీలక పాత్రధారి లిండా ఆర్చర్డ్. ఆమె 1994లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సాంకేతికత ద్వారా గర్భం దాల్చి, ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. అయితే ఆ సమయంలో మిగిలిపోయిన మూడు పిండాలను భవిష్యత్ అవసరాల కోసం ఫ్రీజ్ చేసి భద్రపరిచారు.

Also Read: ఈ రోజుల్లో కలిస్తే గర్భం వస్తుంది..ఇలా ట్రై చేయండి.!

సంవత్సరాలు గడిచాయి. లిండా మెనోపాజ్ దశకు చేరుకున్నాక, ఆ పిండాలను వృథా చేయకుండా, జీవం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే, ‘నైట్‌లైట్ క్రిస్టియన్ అడాప్షన్స్’ అనే సంస్థ నిర్వహించే ‘స్నోఫ్లేక్స్’ కార్యక్రమంలో భాగంగా వాటిని దానం చేశారు. ఇదే సమయంలో పిల్లల కోసం ఎదురు చూస్తున్న లిండ్సే, టిమ్ పియర్స్ దంపతులు ఆ డొనేట్ చేసిన పిండాలను స్వీకరించారు.

వైద్య నిపుణులు లిండా డొనేట్ చేసిన మూడు పిండాలలో రెండింటిని విజయవంతంగా పునరుత్పత్తి స్థితికి తీసుకువచ్చారు. వాటిలో ఒకటి లిండ్సే గర్భంలో ప్రవేశపెట్టగా, అది సఫలమై థియో అనే ఆరోగ్యవంతమైన బాబు జన్మించాడు. ఈ క్లిష్టమైన ప్రక్రియను టెన్నస్సీలోని ఐవీఎఫ్ నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ పిండాలు 1990లలో ఉన్న సాంకేతికతతో ఫ్రీజ్ చేయబడ్డవే అయినప్పటికీ, అవి ఇప్పుడు కూడా అంతే విజయవంతంగా అభివృద్ధి చెందాయి.

ఇక్కడ ఏర్పడిన బంధం ఆసక్తికరమైనది. థియోకు బయోలాజికల్‌గా 30 ఏళ్ల వయసున్న సోదరి ఉన్నారు. ఆమె 1994లో ఇదే ఐవీఎఫ్ బ్యాచ్‌లోని మరో పిండం ద్వారా జన్మించారు. అంటే, ఒకేసారి సృష్టించబడిన పిండాల నుంచి సరిగ్గా మూడున్నర దశాబ్దాల వ్యత్యాసంలో అన్నాచెల్లెళ్లు జన్మించడం వైద్య చరిత్రలోనే ఓ అరుదైన సంఘటనగా నిలిచింది. అందుకే, ఇప్పుడు థియోను ప్రపంచంలోనే "అత్యంత పురాతన శిశువు"గా భావిస్తున్నారు. 

Also Read: IVF ద్వారా లింగ నిర్ధారణ సాధ్యమా?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post