Fertility Window: గర్భం రావాలంటే… కేవలం కలయిక జరగడం మాత్రమే చాలదు. సరైన సమయాన, సరైన విధంగా జరగాలి. ముఖ్యంగా ఓవ్యూలేషన్ డే లెక్కించడం చాలా కీలకం. ఎందుకంటే... ఆ 24 గంటలే మీ బెస్ట్ ఛాన్స్.
ఓవ్యూలేషన్ అంటే ఓవరిలో ఉన్న అండం, బయటకు విడుదల కావడం. ఈ అండం విడుదలైన తర్వాత సుమారు 12 నుంచి 24 గంటల పాటు మాత్రమే స్పెర్మ్‌తో ఫెర్టిలైజ్ అవ్వగలదు. స్పెర్మ్స్ అయితే 3-5 రోజులు లైవ్ ఉంటాయి. అందుకే ఓవ్యూలేషన్‌కు ముందు 1-2 రోజులు, అలాగే ఓవ్యూలేషన్ డే అనేది “ఫెర్టైల్ విండో”గా పరిగణించబడుతుంది.
ఓవ్యూలేషన్ డే ఎలా లెక్కించాలి?
మీ పీరియడ్ సైకిల్ రెగ్యులర్‌గా 28 రోజులు ఉంటే, మొదటి రోజు నుండి 14వ రోజు వరకు లెక్కించండి. అదే రోజు ఓవ్యూలేషన్ జరగే అవకాశం ఉంటుంది. అంటే… 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య మీరు ట్రై చేస్తే, గర్భం వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
Also Read: IVF ద్వారా లింగ నిర్ధారణ సాధ్యమా?
మీ సైకిల్ 30 రోజులు ఉంటే? అప్పుడు 16వ రోజు (30-14) ఓవ్యూలేషన్ అవుతుంది. ఈ గ్యాప్ అనేది ప్రతి ఒక్కరిలో తేడా ఉంటుంది. అందుకే ఓవ్యూలేషన్ ట్రాకింగ్ కోసం కొన్ని స్మార్ట్ ఆప్స్ లేదా ఓవ్యూలేషన్ కిట్ ఉపయోగించవచ్చు.
ఇంకో సింపుల్ టిప్ ఏంటంటే.. కొంతమంది స్త్రీలు ఓవ్యూలేషన్ సమయంలో లైట్ పెయిన్, సర్వికల్ మ్యూకస్‌లో మార్పులు లేదా చిన్న మార్పులు అనుభవిస్తారు. వాటిని గమనించటం కూడా ఓవ్యూలేషన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.
గర్భం కావాలంటే టైమింగ్ చాల ముఖ్యం. మీరు మీ ఫెర్టైల్ డేస్‌ని బాగా అర్థం చేసుకుని, అదే సమయానికి కలయిక జరిపితే, నేచురల్ గా గర్భధారణకు అవకాశాలు బాగా పెరిగిపోతాయి.
Also Read: మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల గర్భధారణపై ప్రభావం ఉంటుందా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility