Stress and Pregnancy: మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల గర్భధారణపై ప్రభావం ఉంటుందా?

Stress and Pregnancy: మానసిక ఒత్తిడి (Stress) మరియు నిద్రలేమి (Sleep Deprivation) గర్భధారణపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది రీప్రొడక్టివ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి అండోత్సర్గం (Ovulation) ఇర్రెగ్యులర్ కావడానికి దారితీస్తుంది. దీని వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

నిద్రలేమి వల్ల శరీరంలోని Biological clock సమతుల్యత కోల్పోయి, హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఫెర్టిలిటీకి కీలకమైన హార్మోన్ల విడుదలపై నిద్రలేమి ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోజూ తక్కువ నిద్ర తీసుకునే మహిళల్లో మెన్స్ట్రువల్ సైకిల్ మారిపోవడం, ఓవ్యులేషన్ జరగకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

పలుమార్లు ఒత్తిడికి గురవడం వల్ల మానసికంగా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతూ, భార్యాభర్తల బంధం మీద కూడా ప్రభావం చూపవచ్చు. దీంతో తగిన సమయంలో ఇంటర్‌కోర్స్ జరగకపోవడం వల్ల గర్భం రావడానికి అవరోధం ఏర్పడుతుంది.

అంతేకాక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా, ధ్యానం, మ్యూజిక్ థెరపీ వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నిద్ర కోసం ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు దూరంగా పెట్టడం, నిద్రకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవడం అవసరం.

గర్భధారణకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితి కూడా కీలకం. మానసికంగా ప్రశాంతంగా ఉండడం, నాణ్యమైన నిద్ర తీసుకోవడం ద్వారా హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. కాబట్టి, ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడే వారు ఈ అంశాలపైనా శ్రద్ధ వహించడం ఎంతో అవసరం.

Also Read: Female Infertility అంటే ఏమిటి?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post