Female Infertility: ఇన్‌ఫెర్టిలిటీ అంటే.. వివాహం తర్వాత ఒక సంవత్సరం వరకూ సాధారణ లైంగిక జీవితం ఉన్నప్పటికీ గర్భధారణ జరగకపోవడం. ఇది మహిళల వల్ల కావచ్చు, పురుషుల వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ స్వల్ప జెనెటిక్స్, హార్మోనల్, ఫిజికల్ కారణాల వల్ల వచ్చే సమస్యల వల్లనూ కావచ్చు. మహిళలలో గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్, అండాశయాల పనితీరు వంటి అంశాల్లో ఏదైనా లోపం ఉన్నా, ఇది గర్భధారణలో ఆటంకంగా మారుతుంది. ఈ పరిస్థితిని “female-origin infertility" గా పరిగణిస్తారు.
మహిళలలో ఇన్‌ఫెర్టిలిటీకి కారణమయ్యే ప్రధాన అంశాలు అనేకం ఉంటాయి. మోతాదుకు మించి లేదా తక్కువగా ఉండే హార్మోన్ల ప్రభావం, పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ (PCOS), ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్ అసమతుల్యత, అసాధారణమైన మెన్స్ట్రువల్ సైకిల్స్, లేదా అండాలను విడుదల చేయడంలో లోపం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఇవే కాకుండా, యూటరైన్ ఫైబ్రాయిడ్స్, ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్, గతంలో జరిగిన అబార్షన్స్ లేదా శస్త్రచికిత్సలు కూడా ఇన్‌ఫెర్టిలిటీకి దోహదపడతాయి.
ఇన్‌ఫెర్టిలిటీ నిర్ధారణ కోసం ఆధునిక వైద్య రంగంలో అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. హార్మోన్ల స్థాయిని తెలుసుకునే బ్లడ్ టెస్టులు, అండాశయాల పనితీరును తెలుసుకునే ఓవల్యూషన్ ట్రాకింగ్, గర్భాశయ ఆకృతిని పరిశీలించే సోనోగ్రఫీ (TVS / Pelvic ultrasound), ఫాలోపియన్ ట్యూబ్ ఓపెన్‌గా ఉన్నదా లేదాని పరీక్షించే HSG (హిస్టెరోసల్పింగోగ్రఫీ), మరియు లాపరోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా సమస్యలను అంచనా వేయడం జరుగుతుంది.
Also Read: ఈ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగం చేసుకుంటే స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility