PCOS వల్ల ఓవ్యూలేషన్ లో ఆటంకం: పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ఓవరీలు హార్మోన్‌ల అసమతుల్యత వల్ల అనేక స్మాల్ సిస్టుల్ని అభివృద్ధి చేయడం వల్ల ఏర్పడుతుంది. ఇది రెగ్యులర్ ఓవ్యూలేషన్ ను అడ్డుకుంటుంది. అంటే ప్రతి నెల అండం విడుదల కాకపోవడం గర్భధారణలో ప్రధాన అడ్డంకిగా మారుతుంది. దీంతో పాటు మెన్స్ట్రుయల్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా మారుతుంది.
PCOS వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్: PCOS ఉన్న మహిళల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటంతో ఆండ్రోజెన్ (పురుష హార్మోన్) స్థాయి పెరుగుతుంది. ఇది ఓవరీలు సరిగ్గా పని చేయకుండా చేస్తుంది. అండం పరిపక్వం కాకపోవడం, ఫాలికుల్స్ పూర్తిగా తయారుకాకపోవడం వంటి సమస్యలు ఏర్పడి గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి.
థైరాయిడ్ అనియంత్రణ ప్రభావం: హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువగా పని చేయడం) లేదా హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ అధికంగా పని చేయడం) రెండూ మహిళల ఫెర్టిలిటీపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. హార్మోన్ల సమతుల్యతలో మార్పులు రాగానే అండాల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. మెన్సెస్ లో ఆలస్యం వంటి మార్పులు రావచ్చు.
హై ప్రోలాక్టిన్ స్థాయిల ప్రభావం: ప్రోలాక్టిన్ అనే హార్మోన్ అధికంగా ఉన్నప్పుడు అది ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది మెన్స్ట్రుయేషన్ సైకిల్‌ను డిస్టర్బ్ చేసి, ఓవ్యూలేషన్ ను అడ్డుకుంటుంది. ఫలితంగా గర్భధారణ జరగడం కష్టమవుతుంది. ఇది సాధారణంగా స్ట్రెస్, పిట్యుటరీ గ్లాండ్ లో మార్పులు వలన వస్తుంది.
హార్మోన్ అసమతుల్యతకు పరిష్కార మార్గాలు: ఈ సమస్యలకు పరిష్కారంగా వైద్యులు మధుమేహ నివారణ ఔషధాలు, హార్మోన్ రెగ్యులేషన్ ట్రీట్మెంట్స్ (ఓవ్యూలేషన్ ఇండక్షన్), థైరాయిడ్ టాబ్లెట్స్ వంటివి సూచిస్తారు. లైఫ్ స్టైల్ లో మార్పులు, వ్యాయామం, హెల్తీ డైట్ కూడా హార్మోన్ల సమతుల్యతను నివారించేందుకు సహాయపడతాయి. ఫెర్టిలిటీ స్పెషలిస్టుల గైడెన్స్ తీసుకుంటే గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి.
Also Read: Female Infertility అంటే ఏమిటి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility