Male Infertility అంటే, మహిళ సాధారణంగా ఆరోగ్యంగా ఉండి, రెగ్యులర్‌గా ఇంటర్‌కోర్స్ చేసినా గర్భం ధరించకపోవడం. ఇది సాధారణంగా స్పెర్మ్ సంబంధిత సమస్యల వల్ల కలుగుతుంది. స్పెర్మ్ సంఖ్య తక్కువగా ఉండటం (low sperm count), స్పెర్మ్ శక్తి లేమి (low motility), స్పెర్మ్ ఆకారంలో లోపాలు (abnormal morphology), లేదా స్పెర్మ్ ఉత్పత్తి లేకపోవడం (azoospermia) వంటి కారణాల వల్ల మగవారు పిల్లల్ని కలగకపోవచ్చు.
ఇది ఒక్కోసారి పుట్టుకతో ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యత, వేరికోసెల్, అశుభ్ర జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపుతాయి. అలాగే తరచుగా వేడి వాతావరణంలో పని చేయడం లేదా మొబైల్‌ఫోన్లు దగ్గరగా పెట్టుకోవడం వంటి అలవాట్ల వల్ల కూడా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది.
Infertility అనేది పరిష్కరించలేని సమస్య కాదు. స్పెర్మ్ అనాలిసిస్, హార్మోన్ టెస్టింగ్, స్క్రోటల్ స్కాన్, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లాంటి పరీక్షల ద్వారా సమస్య ఏంటో గుర్తించవచ్చు. దీని ఆధారంగా వైద్యులు చికిత్సలు సూచిస్తారు. మందులతో, జీవనశైలి మార్పులతో లేదా అవసరమైతే IUI, IVF, ICSI వంటి అడ్వాన్స్‌డ్ ఫెర్టిలిటీ టెక్నాలజీల సహాయంతో కూడా పిల్లలు కలగొచ్చు.
పురుషుల్లో ఇన్‌ఫెర్టిలిటీ ఒక సర్వసాధారణమైన సమస్య. దీన్ని సిగ్గుపడకుండా తీసుకోవాలి. తొందరగా సమస్యను గుర్తించి సకాలంలో సలహా తీసుకుంటే, ఎంతో మంది తల్లిదండ్రుల కల నెరవేర్చుకోవచ్చు.
Also Read: Female Infertility అంటే ఏమిటి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility