Blocked Fallopian Tubes: ఫాలోపియన్ ట్యూబ్స్ పాత్ర ఏంటి?: ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి మహిళలు ప్రెగ్నెంట్ కావడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అండాశయాల నుండి విడుదలైన అండాన్ని స్పెర్మ్‌తో కలిపే ప్రాసెస్ ఈ ట్యూబ్‌ల్లోనే జరుగుతుంది. అండం ఫర్టిలైజ్ అయిన తర్వాత యుటెరస్ (గర్భాశయం) లోకి వెళ్లి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ట్యూబ్‌లు బ్లాక్ అయ్యుంటే ఈ ప్రాసెస్ ఆగిపోతుంది.
బ్లాకేజీ ఎలా వస్తుంది?: ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. పెల్విక్ ఇన్ఫెక్షన్లు, శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు (STDs), ఎండోమెట్రియోసిస్, పూర్వపు అబార్షణలకు సంబంధించిన సర్జరీలు, లేదా ట్యూబ్‌లపై ఏమైనా దెబ్బల వల్ల బ్లాకేజీ ఏర్పడుతుంది.
లక్షణాలు లేకుండా ఉండే ప్రమాదం: ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయితే చాలా సందర్భాల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు ఉండవు. కానీ, గర్భం రాకపోవడం ద్వారా దీనిని గుర్తించవచ్చు. కొన్నిసార్లు బ్లాక్ ట్యూబ్‌ల వల్ల ట్యూబల్ ప్రెగ్నెన్సీ (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది, ఇది అత్యవసర వైద్య చికిత్స అవసరం చేసే పరిస్థితి.
డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్: ఈ సమస్యను గుర్తించేందుకు “హిస్టెరోసల్పింగోగ్రఫీ (HSG)”, “సోనోహిస్టెరోగ్రఫీ”, లేదా లాపరోస్కోపీ వంటివి ఉపయోగిస్తారు. ట్యూబ్ పూర్తిగా బ్లాక్ అయి ఉంటే వైద్యులు IVF (In Vitro Fertilization) కి సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో మైనర్ సర్జరీ ద్వారా ట్యూబ్ ఓపెన్ చేయగలిగితే నేచురల్ గా గర్భం వచ్చే అవకాశమూ ఉంటుంది.
గర్భధారణపై ప్రభావం: ఫాలోపియన్ ట్యూబ్ ఒకటి బ్లాక్ అయినా, రెండవది ఓపెన్ గా ఉంటే గర్భధారణ సాధ్యమే. కానీ, రెండు ట్యూబ్‌లు పూర్తిగా బ్లాక్ అయితే IVF లాంటి అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. ఈ పరిస్థితిని త్వరగా గుర్తించి, తగిన వైద్య చికిత్స తీసుకుంటే గర్భం కలగడానికి మంచి అవకాశాలు ఉంటాయి.
Also Read: PCOS, థైరాయిడ్, హార్మోన్ అసమతుల్యత వంటివి గర్భధారణపై ఎలా ప్రభావితం చేస్తాయి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility