Masturbation: తరచు హస్త ప్రయోగం చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా రావచ్చు, కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. రోజులో బాగా ఎక్కువసార్లు హస్త ప్రయోగం చేస్తే స్పెర్మ్ పరిపక్వం కావడానికి సమయం ఉండదు, ఫలితంగా స్పెర్మ్ తక్కువగా లేదా చలనం లేనట్లుగా ఉండవచ్చు. కానీ కొంత రోజులు విరామం ఇచ్చితే మళ్లీ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది.
పోర్న్ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగం చేయడం కొంతమందిలో మానసిక అలవాటుగా మారి, అసలైన సంబంధాలపై ఆసక్తి తగ్గించే అవకాశం ఉంది. దీన్ని అతి బాగా చేయడం వల్ల డోపమైన్ లెవెల్స్ డిస్టర్బ్ కావచ్చు, ఇది లైబిడోపై (sexual desire) ప్రభావం చూపుతుంది.
అయితే, వారానికి 2–3 సార్లు హస్త ప్రయోగం చేయడం నార్మల్‌గా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి హానికరం కాదు, స్పెర్మ్ క్వాలిటీపై దీర్ఘకాలిక ప్రభావం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువగా చేస్తూ పోర్న్ మీద డిపెండెంట్ అవ్వడం ప్రమాదకరం.
స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరచాలంటే, హెల్తీ డైట్, సరైన నిద్ర, స్ట్రెస్ లేని జీవనశైలి, మద్యపానం, ధూమపానం లేకుండా ఉండటం ఎంతో అవసరం. ఇవే స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ లాంటి అంశాలపై నిజమైన ప్రభావం చూపుతాయి.
హస్త ప్రయోగం చేయడం మామూలే, కానీ అది మితంగా ఉండాలి. దీన్ని పోర్న్‌తో కలిపి ఎక్కువగా చేస్తే మాత్రం శారీరక, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్పెర్మ్ క్వాలిటీపై దీర్ఘకాలికంగా ప్రభావం ఉండాలంటే జీవనశైలి ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Also Read: సెకండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు కష్టమవుతుంది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility