IUI IVF ICSI Treatment: ప్రస్తుతం చాలా మంది దంపతులు గర్భం కోసం ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించినా విజయవంతం కాకపోవడం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో సహజ గర్భం దాల్చడం కంటే మెరుగైన ఫలితాల కోసం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల అవసరం వస్తుంది. ముఖ్యంగా IUI, IVF, ICSI వంటి ట్రీట్మెంట్లు వివిధ రకాల ఇన్ఫెర్టిలిటీ సమస్యలకూ ఆధారంగా సూచించబడతాయి.
IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఇది సాధారణంగా తక్కువ స్థాయి మేల్ ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు, లేదా మహిళలో ఓవ్యూలేషన్ సరిగ్గా జరగకపోతున్నప్పుడు చేస్తారు. ఇందులో శుద్ధి చేసిన స్పెర్మ్‌ను ఒవ్యూలేషన్ సమయంలో గర్భాశయంలోకి నేరుగా ప్రవేశపెడతారు. ఇది కొద్దిగా సులభమైన, తక్కువ ఖర్చుతో జరిగే చికిత్స.
IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇది మేజర్ ఇన్ఫెర్టిలిటీ సమస్యల కోసం ఉపయోగించే టెక్నిక్. ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యినపుడు, మహిళ ఎగ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా మల్టిపుల్ అబార్షన్స్ అయిన తరువాత IVFను సూచిస్తారు. ఇందులో అండాలను శరీరం వెలుపల తీసి, స్పెర్మ్‌తో ఫెర్టిలైజ్ చేసి, ఏర్పడిన ఎంబ్రియోను గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ICSI అనేది IVF కంటే మరింత స్పెషలైజ్డ్ టెక్నిక్. స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండటం, స్పెర్మ్ మొబిలిటీ సమస్యలు ఉన్నపుడు, లేదా వృద్ధాప్య కారణంగా స్పెర్మ్‌లో జన్యుక్రమ లోపాలు ఉన్నప్పుడు దీనిని చేస్తారు. ఇందులో ఒక్క స్పెర్మ్‌ను ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తారు.
ఈ ట్రీట్మెంట్లు ఎప్పుడూ ముందుగా ప్రయత్నించకూడదు. సహజంగా గర్భం వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించాలి. హార్మోన్ల బ్యాలెన్స్, డైట్, లైఫ్‌స్టైల్ మార్పులు, సాధారణ మందులతో ఫలితం రాకపోతే మాత్రమే ఈ టెక్నాలజీలను పరిగణించాలి.
దీనికి ముందు మంచి ఫెర్టిలిటీ స్పెషలిస్టును సంప్రదించడం మంచిది. ఎందుకంటే ప్రతి జంట పరిస్థితి వేరు, అందుకే ట్రీట్మెంట్ విధానం కూడా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
Also Read: డబుల్ ఇన్‌కమ్ - నో కిడ్స్ అనే ట్రెండ్ ఇక ఆపండి!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility