Superfoods for Fertility: ప్రెగ్నెన్సీ ని పెంచే సూపర్ ఫుడ్స్.! | Pozitiv Fertility, Hyderabad

Superfoods for Fertility: తల్లి కావాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ కొన్ని సందర్భాల్లో శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వల్ల conception లో అంతరాయం కలగొచ్చు. అలాంటి సమయంలో, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా fertility ని సహజంగా మెరుగుపర్చుకోవచ్చు. అలాంటి ప్రెగ్నెన్సీ ని పెంచే సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.


1. బాదం & వాల్‌నట్: ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీ, హార్మోన్ల బ్యాలెన్స్ మెరుగుపరచడంలో సహాయపడతాయి.

2. అవకాడో: ఫోలిక్ యాసిడ్, విటమిన్ E మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న అవకాడో గర్భధారణకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇది ఎండోమెట్రియం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. Pumpkin Seeds: జింక్ అధికంగా ఉండే వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ మరియు మొబిలిటీ మెరుగవుతాయి.

4. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్: ఫోలేట్, ఐరన్ మరియు విటమిన్ C అధికంగా ఉండటంతో గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Also Read: ఆనల్ శృగారం చేయవచ్చా?

5. దానిమ్మ: యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే దానిమ్మ గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది.

6. ఎగ్స్: ప్రోటీన్, విటమిన్ D, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే ఎగ్స్ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి, గర్భధారణకు అనుకూలంగా ఉంటాయి.

7. తాజా పాలు & పెరుగు: కాల్షియం మరియు ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండే ఇవి రీప్రొడక్టివ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

8. Whole Grains (గోధుమలు, బార్లీ, బ్రౌన్ రైస్): ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆహారాలు ఇన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి, ఇది హార్మోన్ బ్యాలెన్స్ కి చాలా అవసరం.

Note: ఈ సూపర్ ఫుడ్స్‌ను ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి తీసుకుంటే గర్భధారణకు సహాయపడే అవకాశాలు పెరుగుతాయి. డైట్ మార్పులు చేసేముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.

Also Read: IUI, IVF, ICSI వంటి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు ఎప్పుడు అవసరం అవుతాయి?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post