IVF vs ICSI Difference: IVF (In Vitro Fertilization) మరియు ICSI (Intracytoplasmic Sperm Injection) రెండూ సంతానోత్పత్తి సమస్యలకు ఉపయోగించే ఆధునిక చికిత్సలు. ఇవి రెండు కూడా శరీరానికి బయట ఆండాన్ని స్పెర్మ్‌తో ఫెర్టిలైజ్ చేసే టెక్నిక్స్ అయినా, వాటి మధ్య పనిచేసే విధానం, అవసరాలు భిన్నంగా ఉంటాయి.
IVF లో, పురుషుడి నుంచి సేకరించిన స్పెర్మ్‌ను కొన్ని వేల గుణాలుగా ఎక్కువగా అండాల చుట్టూ ఉంచుతారు. వీటిలో ఆరోగ్యంగా ఉన్న స్పెర్మ్ అండాన్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. ఇది నేచురల్ సెలెక్షన్‌తో జరుగుతుంది. IVF పద్ధతి సాధారణంగా స్పెర్మ్ కౌంట్ సరిగా ఉన్నవారికి, ఇతర కారణాల వల్ల గర్భం రాని దంపతులకు ఉపయోగపడుతుంది.
ICSI లో, ఒకే ఒక్క స్పెర్మ్‌ను మైక్రో ఇంజెక్షన్ పద్ధతిలో నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా, స్పెర్మ్ చలనం లేకపోయినా లేదా స్పెర్మ్ ఆకృతి సమస్యలు ఉన్నా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఫెర్టిలైజేషన్ ఛాన్స్ మరింత పెరుగుతుంది.
Also Read: మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల గర్భధారణపై ప్రభావం ఉంటుందా?
మరొక ముఖ్యమైన తేడా ఏంటంటే.. IVF లో ఫెర్టిలైజేషన్ ప్రక్రియ బహుళ స్పెర్మ్‌తో సహజ రీతిలో జరుగుతుంది, కాని ICSI లో manual intervention కీలకంగా ఉంటుంది. ICSI ఎక్కువగా పురుషుల ఇన్‌ఫెర్టిలిటీ కేసుల్లో లేదా IVF ఫెయిలయిన తరువాత ఉపయోగిస్తారు.
ఇద్దరి పరిస్థితిని బట్టి డాక్టర్లు IVF లేదా ICSI ను ఎంచుకుంటారు. స్పెర్మ్ కౌంట్ మరియు క్వాలిటీ బాగుంటే IVF సరిపోతుంది. కానీ తీవ్ర ఇన్‌ఫెర్టిలిటీ కేస్‌లో ICSI అద్భుత ఫలితాలు ఇస్తుంది. అందుకే సరైన టెస్టులు చేయించుకుని, ఫెర్టిలిటీ స్పెషలిస్టు సలహాతో ట్రీట్మెంట్ ఎంచుకోవడం మేలైన మార్గం.
Also Read: ప్రెగ్నెన్సీ ని పెంచే సూపర్ ఫుడ్స్.!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility