IVF Gender Selection: IVF ద్వారా లింగ నిర్ధారణ సాధ్యమా? | Pozitiv Fertility, Hyderabad

IVF Gender Selection: IVF (In Vitro Fertilization) టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఈ ప్రక్రియలో అండాన్ని బైట ఫెర్టిలైజ్ చేసి, ఎంబ్రియోను గర్భాశయంలోకి ప్రవేశ పెడతారు. దీనిలో PGD (Preimplantation Genetic Diagnosis) అనే టెక్నిక్ ద్వారా ఎంబ్రియోలో జెనెటిక్ డిస్‌ ఆర్డర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేయవచ్చు. దీనివల్ల ఎంబ్రియో యొక్క లింగం (Gender) కూడా తెలిసే అవకాశం ఉంటుంది.


కానీ... భారతదేశంలో (India) లింగ నిర్ధారణ (Gender Selection) నిషిద్ధం. PCPNDT Act (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act), 1994 ప్రకారం లింగ నిర్ధారణ చేయడం గానీ, తెలియజేయడం గానీ చట్ట విరుద్ధం. ఇది శిక్షార్హమైన నేరం.

Also Read: మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల గర్భధారణపై ప్రభావం ఉంటుందా?

అంతర్జాతీయంగా ఏముంది?

కొన్ని దేశాల్లో లింగ ఎంపికను కుటుంబ సమతుల్యత (Family Balancing) కోసమేనని అనుమతిస్తారు. ఉదాహరణకు USA, Thailand వంటి దేశాల్లో లింగ ఎంపిక సాధ్యమవుతుంది.. కానీ అక్కడ కూడా ఇది కఠిన నియంత్రణల మధ్య జరుగుతుంది.

ముఖ్యమైన విషయం:

IVF ప్రక్రియలో లింగం తెలుసుకోవచ్చు అన్నది టెక్నికల్‌గా నిజం. కానీ మన దేశంలో, ఇది చట్ట విరుద్ధం. దాంతోపాటు ఇది నైతికంగా కూడా సందేహాస్పదమైన అంశం. పుట్టబోయే బిడ్డ ఆడా లేదా మగా అన్నది తెలుసుకోవడం IVF లో టెక్నాలజీ వల్ల సాధ్యమైనా, భారతదేశంలో ఇది చట్టబద్ధంగా నిషిద్ధం. కాబట్టి దీన్ని ప్రయత్నించకపోవడమే మంచిది.

Also Read: IVF vs ICSI తేడా తెలుసుకోండి?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post