Dual Income, No Kids (DINK): "డబుల్ ఇన్‌కమ్ - నో కిడ్స్" అనే ట్రెండ్ యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. దీని వెనుక కారణాలు వేర్వేరు ఉండొచ్చు కానీ.. కెరీర్ పై ఫోకస్, పెరుగుతున్న ఖర్చులు, జీవితానికి ప్రాధాన్యతలు మారడం… కానీ కొందరికి ఇది ఒక ఎంపిక అయితే, మరికొందరికి ఇది వైద్యపరమైన సమస్య అంటే Infertility.
ఇన్‌ఫెర్టిలిటీ అనేది ఇప్పుడు ఒక సామాన్యమైన ఆరోగ్య సమస్యగా మారింది. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేకపోవడం వెనుక చాలా సందర్భాల్లో శారీరక సమస్యలు ఉంటాయి. అందులో మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, స్పెర్మ్ మోటిలిటీ సమస్యలు, లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాలు కనిపిస్తున్నాయి.
కొన్నిసార్లు భార్యాభర్తలిద్దరికీ పరీక్షలు చేయించిన తర్వాతే అసలు కారణం బయటపడుతుంది. ఈ పరీక్షలు ఆలస్యం కాకముందే చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వయస్సు పెరగడంతో సహజ గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి.
ఈ ట్రెండ్ ట్రెండ్ గా కాక, ఒక బాధగా మారకముందే... మీరు పిల్లల్ని కోరుకుంటున్నారా? అయితే ఒకసారి ఫెర్టిలిటీ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే కాలం, శరీరం మారుతున్నాయి... కానీ ఆశలు, కుటుంబం మీద ప్రేమ మారకూడదు కదా.. ఇలాంటి విషయాల్లో అవగాహన పెంచుకోవడం ద్వారా ఎంతో మందికి సహాయం చేయవచ్చు. సంపూర్ణ కుటుంబాన్ని కలిగి ఉండాలని ఆశపడే ప్రతి కపుల్ కి ఇది ఒక మంచి స్టార్ట్ కావచ్చు.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility